తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం 2013 డిసెంబర్ నెలలో లివర్ క్యాన్సర్ తో బాధపడుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన మరణించి దశాబ్ద కాలమవుతున్న నేపథ్యంలో ఈయన కుమారుడు తాజాగా రవితేజ బ్రహ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుమారుడు రవితేజ బ్రహ్మ మాట్లాడుతూ తన తండ్రి చిన్న పెద్ద అని తేడా లేకుండా హీరోలందరి సినిమాలలో నటించారని తెలిపారు.
ఆయన రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకుండా నిర్మాతలు ఇచ్చిన మొత్తాన్ని తీసుకుని వచ్చేవారు. భావించి కొందరు నిర్మాతలు నాన్నకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని అయితే ప్రస్తుతం అలాంటి నిర్మాతలు అందరూ కూడా ఇబ్బందులలో ఉన్నారని తెలిపారు. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నాన్న మరణించినప్పటికీ ఆయనని చూడడం కోసం ఇండస్ట్రీకి చెందినటువంటి రాజేంద్రప్రసాద్, ఆలీ, గోపీచంద్, బ్రహ్మానందం గారు, దగ్గుబాటి కుటుంబ సభ్యులు వంటి పలువురు హాజరయ్యారు. అయితే నాన్న ఆఖరి చూపు కోసం మెగా కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదని ఈయన తెలియజేశారు.
రాకపోవడానికి కారణాలు తనకు తెలియదని రవితేజ బ్రహ్మ తెలిపారు. నాన్న చనిపోయే ముందు మాకు ఏ విషయాలు ఏ విషయాలు చెప్పలేదు. అందుకే తనని ఫిలిం ఛాంబర్ తీసుకెళ్లలేదు. నాన్న పార్తివదేహాన్ని నేరుగా మా సొంత గ్రామానికి తీసుకెళ్లి అక్కడ అంతక్రియలు పూర్తి చేసామని తెలిపారు.
వందల సినిమాలలో కమెడియన్ గా నటించిన (Dharmavarapu Subramanyam) ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎక్కువగా లెక్చరర్స్ పాత్రలలో నటించి మెప్పించారు.ఇక 2012వ సంవత్సరంలో ఈయనకు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉందని తెలిసింది. ఇలా క్యాన్సర్ తో బాధపడుతూ మంచానికి పరిమితం అయినటువంటి ధర్మవరపు సుబ్రహ్మణ్యం 2013 డిసెంబర్ నెలలో మృతి చెందారు.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?