కొంతమంది కమెడియన్స్ మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా మన అందరికి గుర్తుండిపోతారు,అలాంటి కమెడియన్స్ లో ఒకరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. జంధ్యాల దర్శకత్వం లో రాజేంద్ర ప్రసాద్ హీరో గా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కమెడియన్ గా నటించిన ఈయన, సుమారుగా 700 చిత్రాలలో నటించినట్టు తెలుస్తుంది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం లో స్పెషల్ టాలెంట్ ఏమిటంటే కంటెంట్ లేని సన్నివేశానికి కూడా తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగలడు.
అలాంటి టాలెంట్ ఇండస్ట్రీ లో కేవలం ఇద్దరు ముగ్గురు కమెడియన్స్ లో మాత్రమే ఉంది, ఆ ఇద్దరు ముగ్గురు లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా ఒకడు, అయితే దురదృష్టం కొద్దీ ఆయన 2013 వ సంవత్సరం లో లివర్ క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయారు. అయితే ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది ఆ రోజుల్లో.
కెరీర్ ప్రారంభ రోజుల్లో 24 గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయని, కానీ ఒక స్టేజికి వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు దాటితే సినిమా ప్రపంచంతో తనకి ఉన్న సంబంధాలు మొత్తం తెంచేసుకుంటాను అని ధర్మవరపు సుబ్రహ్మణ్యం అప్పట్లో చెప్పాడు. ఒక స్థాయి వచ్చిన తర్వాత షూటింగ్ ఎగ్గొట్టాలి అని కూడా అనిపించేది అని అన్నాడు (Dharmavarapu Subramanyam) ధర్మవరపు సుబ్రహ్మణ్యం.
అంటే పారితోషికం విషయం లో సంతృప్తి చెందక అలా అనిపించిందా అని అడగగా, దానికి ధర్మవరపు సుబ్రహ్మణ్యం సమాధానం ఇస్తూ ‘నేను పుట్టుక తోనే ధనవంతుల కుటుంబం లో పుట్టిన, నాకు ఉన్నన్ని ఆస్తులు రాజకీయ నాయకులకు కూడా లేదు, డబ్బులు నాకు అసలు సమస్య కాదు’ అని అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!