Dhee: డాన్స్ చేస్తూ కింద పడిపోయిన కంటెస్టెంట్!

బుల్లితెరపై అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’. పన్నెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ డాన్స్ షో ఇప్పుడు పదమూడో సీజన్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. ఈ షో ద్వారా పరిచయమైన ఎందరో డాన్సర్లు కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. చాలా మంది డాన్సర్ లకు సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ షోలో డాన్స్ చేస్తూ ఓ లేడీ కంటెస్టెంట్ ప్రమాదానికి గురైంది.

దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఓ లేడీ కంటెస్టెంట్ డాన్స్ చేస్తూ ప్రమాదవశాత్తు స్టేజ్ మీద నుండి కింద పడిపోయింది. దీంతో ఆమెకి తలకు బలమైన గాయం తగిలినట్లుగా ప్రోమోలో చూపించారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకొని షో నిర్వహిస్తున్నప్పటికీ.. సదరు కంటెస్టెంట్ డాన్స్ చేస్తూ కిందకు దూకే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయింది.

ఆమె దుస్తులకు రక్తం ఉన్నట్లుగా విజువల్స్ లో కనిపిస్తోంది. అసలు ఈ ప్రమాదం నిజంగానే జరిగిందా..? లేక పబ్లిసిటీ కోసం ప్రోమోను ఇలా కట్ చేశారా అనేది తెలియాల్సివుంది. అయితే నెటిజన్లు మాత్రం కచ్చితంగా ఇది వ్యూస్ కోసం కట్ చేసిన ప్రోమోనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus