భారీ కలక్షన్స్ తో దూసుకుపోతున్న ధృవ
- December 13, 2016 / 10:41 AM ISTByFilmy Focus
డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ధృవ గత శుక్రవారం విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్, ఎన్. వి. ప్రసాద్ లు సంయుక్తం గా నిర్మించిన ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో ప్రదర్శితమవుతోంది. చెర్రీ, అరవింద్ స్వామి పోటాపోటీ నటన, రకుల్ ప్రీత్ సింగ్ అందాలు, పీ ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, హిప్ హప్ తమీజా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కలిసి ధృవని విజయతీరానికి చేర్చాయి. నాలుగురోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లను వసూల్ చేసింది. ఓవర్సీస్ లో చరణ్ ఇది వరకు సినిమాల కంటే మించి కలెక్షన్లను రాబడుతోంది. అమెరికాలో ఈ మూవీ సోమవారానికి ఒక మిలియన్ డాలర్ల మార్క్ ని దాటేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కలెక్షన్లు ప్రాంతాల వారీగా…
సీడెడ్ 4.4 కోట్లు
వైజాగ్ 3.29 కోట్లు
ఈస్ట్ గోదావరి 1.98 కోట్లు
వెస్ట్ గోదావరి 1.66 కోట్లు
కృష్ణ 1.86 కోట్లు
గుంటూరు 2.26 కోట్లు
నెల్లూరు 81 లక్షలు
నిజాం 8.74 కోట్లు
మొత్తం 25.00 కోట్లు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















