తాము ఆరాధించే హీరో చిత్రం ఎంతమేర కలక్షన్స్ సాధించిందో తెలుసుకోవాలని ప్రతి ఒక అభిమాని కోరుకుంటాడు. అయితే నిర్మాతలు సినిమా వసూళ్లను ప్రకటించేటప్పుడు షేర్, గ్రాస్ అంటూ కొన్ని లెక్కలు చెబుతుంటారు. వీటి మధ్య మతలబు ఏమిటో.. తెలియక తికమక పడుతుంటారు. అందుకే వీటి మధ్య తేడాని వివరించే ప్రయత్నం చేస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ తొలి వారానికి ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల గ్రాస్ కలెక్ట్ జేసింది. అంటే ఈ చిత్రం ప్రదర్శించిన అన్ని థియేటర్లర్లో అమ్ముడుపోయిన టికెట్ల విలువ మొత్తం ఇది. అదే ఈ చిత్రం షేర్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీక్ 80 కోట్ల షేర్ సాధించింది.
అంటే ప్రతి థియేటర్ ఓనర్ తను టికెట్లు అమ్మగా వచ్చిన మొత్తం లోంచి రెంట్ తీసుకొని, ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ తొలిగించి మిగిలిన అమౌంట్ ని నిర్మాతకు అందిస్తారు. అలా అన్ని థియేటర్ల వారు నిర్మాత చేతికి అందించిన మొత్తమే షేర్. థియేటర్ రెంట్స్, పన్నులు పోను నిర్మాత రామ్ చరణ్ చేతికి 80 కోట్లు అందింది అన్నమాట. సినిమాను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి.. అవి ఫుల్ కాకపోతే కలక్షన్స్ ఎక్కువగా వచ్చినా, షేర్ తక్కువ వస్తుంది. అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయితే గ్రాస్ తో పాటు షేర్ ఎక్కువగా వస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.