Sukumar , Srikanth: ‘దసరా’ దర్శకుడికి.. సుకుమార్ కు మధ్య గొడవలు.. నిజమేనా?

శ్రీకాంత్ ఓదెల .. మార్చ్ 30 కి ముందు వరకు ఈ పేరు పెద్ద పాపులర్ కాదు. ‘ నానితో సినిమా చేస్తున్నాడట. ‘ ఆ ఒక్క మాటతో మాత్రమే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. నాని కూడా ఈ మూవీకి ముందు ఫాంలో లేడు కాబట్టి.. దసరా రెగ్యులర్ హాట్ టాపిక్ అవ్వలేదు. అయితే మార్చ్ 30న సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

మాస్ ఏరియాల్లో చాలా మంది ఈ సినిమా సుకుమారే డైరెక్ట్ చేశాడా అనే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. ఆ రేంజ్ లో ఈ యంగ్ డైరెక్టర్ దసరా ని ఆవిష్కరించాడు. అయితే శ్రీకాంత్.. సుకుమార్ కు శిష్యుడు అన్న సంగతి అతి తక్కువ మందికి మాత్రమే తెలిసుంటుంది. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ ఓదెల .. సుకుమార్ శిష్యుడు అయినప్పటికీ..అతనితో మనస్పర్ధలు ఉన్నాయని ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

అందుకే శ్రీకాంత్.. దసరా ప్రమోషన్స్ లో ఇతను తన గురువు సుకుమార్ (Sukumar) పేరు ఎక్కువగా చెప్పలేదు అని తెలుస్తుంది. అయితే దసరా సినిమా ఆరంభంలోనే సుకుమార్ కు స్పెషల్ థాంక్స్ చెబుతూ ఆయన పేరు పడింది. అది శ్రీకాంత్ వల్ల కాదు నిర్మాత సుధాకర్ చెరుకూరి వల్ల అని తెలుస్తుంది. నిజానికి సుకుమార్ తన సినిమా హిట్ అయితే తన టీమ్ తో పాటు యూనిట్ మెంబెర్స్ ను కూడా స్టేజి పైకి పిలిచి వాళ్ళ టాలెంట్ గురించి చెప్పి స్పెషల్ థాంక్స్ చెబుతూ ఉంటాడు. మరి శ్రీకాంత్ విషయంలో ఏం జరిగింది అనేది అంతు చిక్కని ప్రశ్న .

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus