తల్లి నుండి ప్రేమ, తండ్రి నుండి కోపం ఎదురైతే… ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఏడ్వాలో నవ్వాలో తెలియదు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సినిమా పరిస్థితి అలానే ఉంది అంటున్నారు నెటిజన్లు. కారణం ఆ సినిమా మీద తెలుగు రాష్ట్రాలు చూపిస్తున్న ప్రేమే కారణం. పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా ఉంది ఆ సినిమాకు.
తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ సినిమాకు ప్రభుత్వం అదనపు సౌకర్యాలు కల్పించింది. ఐదో షో వేసుకోవడానికి థియేటర్లకు అనుమతిలిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రెండు వారాల పాటు అంటే ఫిబ్రవరి 25 నుండి మార్చి 11 వరకు సినిమాకు అదనపు షో వేసుకోవచ్చు అనేది ఆ ఉత్తర్వుల సారాంశం. దీంతో తెలంగాణలో సినిమా వసూళ్లకు అదనపు ఆదాయం తోడవుతుంది. అభిమానులకు కూడా సినిమా ఒక షో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.
ఇక సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఇప్పటికే ఉత్తర్వులు వచ్చేసిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. అదనపు షోలు వేయొద్దని, టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి పెంపు ఉండకూడదు అంటూ అక్కడి ప్రభుత్వం థియేటర్లకు ‘అభిమానం’తో ప్రభుత్వం తాఖీదులు జారీ చేసింది. దీంతో వసూళ్ల విషయంలో ‘భీమ్లా నాయక్’… ‘వకీల్‌సాబ్’ లా మారిపోయింది. ఆ సినిమాకు కూడా విడుదల సమయంలో ఇదే పరిస్థితి ఎదురైన విషయం తెలిసిందే.
రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టి కావాలనే పవన్ కల్యాణ్ సినిమాకు ఇబ్బంది పెడుతున్నారని జనసేన కార్తకర్తలు, పవన్ అభిమానులు సోష్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. టికెట్ ధరలపై కొత్త జీవో ఈ నెల మూడో వారంలో కానీ, ఆఖరున కానీ వస్తుంది అన్నారు. కానీ ఇప్పటివరకు అలాంటిదేం లేదు. ‘భీమ్లా నాయక్’ విడుదల తర్వాతే ధరల పెంపు నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని అనుకుంటోందని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి అలానే ఉందనిపిస్తోంది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!