Tollywood: ఈ టాలెంటెడ్ డైరెక్టర్లకు విచిత్రమైన సమస్య వచ్చిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారు. ఈ డైరెక్టర్లలో చాలామంది సక్సెస్ సాధించి స్టార్ హీరోలతో సినిమాలను ఓకే చేయించుకున్నారు. అయితే తమకు ఓకే చెప్పిన హీరోలు వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ డైరెక్టర్ల తర్వాత ప్రాజెక్ట్ లు అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి. పక్కా కమర్షియల్ షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసిన మారుతి ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ మారుతి కాంబో మూవీ వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం దక్కించుకున్న డైరెక్టర్లలో వెంకీ కుడుముల ఒకరు. ఛలో, భీష్మ సినిమాలతో విజయాలను అందుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాల్సి ఉంది. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

బోయపాటి శ్రీను బన్నీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి అటు బన్నీ వైపు నుంచి ఇటు బోయపాటి శ్రీను నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. స్టార్ హీరో పవన్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుల జాబితా ఎక్కువగానే ఉంది. పవన్ హరీష్ శంకర్ కాంబో మూవీ ఆగష్టులో మొదలవుతుందని ప్రచారం జరుగుతున్నా ఈ సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

పవన్ డేట్ల కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్లలో సముద్రఖని, సురేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళతాయో చూడాల్సి ఉంది. ఈ డైరెక్టర్లు స్టార్ హీరోల సినిమాలతో ఘనవిజయాలను సొంతం చేసుకుని కెరీర్ విషయంలో మరింత ఎదగాలని భావిస్తున్నారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ల ప్రాజెక్ట్ లు అనుకున్న విధంగా ముందుకెళతాయో చూడాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus