ఆ సూపర్ హిట్ సినిమా చూసినప్పుడల్లా దిల్ రాజు ఫీలవుతాడట..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత దిల్ రాజుకి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనే బిరుదు ఉంది. ఇప్పటి వరకూ దిల్ రాజు నిర్మించిన చాలా సినిమాలు ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. ‘ఆర్య’ ‘బొమ్మరిల్లు’ ‘కొత్త బంగారు లోకం’ వంటి సినిమాలు క్లాసిక్స్ గా కూడా మిగిలాయి. నైజాం, వైజాగ్ వంటి ఏరియాల్లో దిల్ రాజు హ్యాండోవర్లో ఎన్నో థియేటర్ లు ఉన్నాయి. ‘శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ లో నిర్మింపబడిన సినిమాలు అలాగే ఆ బ్యానర్ పై డిస్ట్రిబ్యూట్ చేయబడ్డ సినిమాల పై భారీ హైప్ ఏర్పడుతుంది.

అందుకు ప్రధాన కారణం దిల్ రాజుగారి జడ్జ్ మెంట్ అనే చెప్పాలి. అలాంటి దిల్ రాజు మహేష్ బాబు నటించిన ఓ సూపర్ హిట్ సినిమాను చూసినప్పుడల్లా తెగ ఫీలవుతారట. ఆ సూపర్ హిట్ సినిమా మరేదో కాదు .. 2003 వ సంవత్సరంలో వచ్చిన ‘ఒక్కడు’ చిత్రం. గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.ఎస్.రాజు నిర్మించారు. ఆ ఏడాది సంక్రాంతి కనుకగా విడుదలైన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. మహేష్ బాబుకి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ఈ చిత్రమే.

అయితే ఈ చిత్రాన్ని ఇప్పటికీ టీవీల్లో చూసినప్పుడల్లా నిర్మాత దిల్ రాజు.. ‘ఆరెరె మా బ్యానర్ లో ఇలాంటి సినిమా ఎందుకు తీయలేకపోయాను’ అని బాదపడతారని ఆయన సన్నిహితులకి చెబుతూ ఫీలవుతూ ఉంటారట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా దిల్ రాజు తెలిపారు. నిజానికి మహేష్ బాబు తో కూడా దిల్ రాజు హ్యాట్రిక్ హిట్ లు కొట్టారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సూపర్ హిట్ చిత్రాలు దిల్ రాజు- మహేష్ కాంబినేషన్లో వచ్చాయి. కానీ ‘ఒక్కడు’ వంటి చిత్రాన్ని ఆయన నిర్మించలేకపోయాను అనే బాద దిల్ రాజుకి ఎక్కువ ఉంటుందట.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus