‘సలార్‌’ కాంబో డేట్స్‌ పట్టేసిన దిల్‌ రాజు

మైల్‌ స్టోన్‌ సినిమాలకు దిల్‌ రాజు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారబోతున్నారా? ఆయన వరుస సినిమాల జోరు చూస్తుంటే అదే అనిపిస్తోంది. మొన్నామధ్య రామ్‌చరణ్‌ 15వ సినిమాను ఓకే చేసుకున్నాడు. అది దిల్‌ రాజు 50వ సినిమా కావడం కూడా విశేషం. ఇప్పుడు ప్రభాస్‌ 25వ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నాడని సమాచారం. అది కూడా పాన్‌ ఇండియా లెవల్‌లోనే. డైరక్టర్‌ అలాంటిలాంటోడు కాదు. ‘కేజీఎఫ్‌’ స్టార్‌ ప్రశాంత్‌ నీల్. అవును ప్రశాంత్‌ నీల్‌ – ప్రభాస్‌ కాంబినేషన్‌ ‘సలార్‌’ తర్వాత మరోసారి చూసే అవకాశమూ ఉందట.

ప్రభాస్‌తో సినిమా చేయాలని దిల్ రాజు చాలా రోజుల నుండి వెయిట్‌ చేస్తున్నారు. అప్పుడెప్పుడో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ తర్వాత మళ్లీ కలసి పని చేయలేదు. ఇన్నాళ్ల వెయిటింగ్‌ తర్వాత ఇప్పుడు ఏకంగా మైల్‌ స్టోన్‌ 25వ సినిమా ఛాన్సే పట్టేశారు దిల్ రాజు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు.. ఇన్నాళ్లకు ఓకే అయ్యాయయట. ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ‘సలార్‌’ లుక్‌ చూసి ప్రశాంత్‌ నీల్‌ను తెగ మెచ్చేసుకుంటున్న ప్రభాస్‌ అభిమానులు.. కొన్ని పొగడ్తలు ఈ సినిమా కోసం కూడా దాచుకోవాలి మరి.

అయితే మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో స్పష్టత రావడం లేదు. కారణం ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. ‘రాధే శ్యామ్‌’ ఇంకా విడుదల కాలేదు. మరోవైపు ‘సలార్’, ‘ఆది పురుష్‌’ షూటింగ్‌ జరుగుతోంది. ఇది కాకుండా వైజయంతి మూవీస్‌ – నాగ్‌ అశ్విన్‌ సినిమా లైన్‌లో ఉంది. ఈ సమయంలో దిల్‌ రాజు సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అనేది తెలియడం లేదు. ప్రభాస్‌ 25 అని ఘనంగా చెబుతున్నారు కాబట్టి.. అవన్నీ వచ్చాక ఈ సినిమా రావాలి.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus