Dil Raju: ‘థాంక్యూ’ కి నెగిటివ్ టాక్.. దిల్ రాజు వెంటనే యాక్సెప్ట్ చేస్తారా?

దిల్ రాజు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. ఆయన నిర్మాణంలో రూపొందే సినిమాలు 90 శాతం విజయం సాధించినవే. అందుకే ఆయన సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ మిగిలిన 10 శాతం .. సెంటిమెంట్ కూడా అప్పుడప్పుడు పని చేస్తూనే ఉంది. ఎంత దిల్ రాజు బ్రాండ్ ఉన్నా కొన్ని సార్లు ఆయన సినిమాలు దారుణంగా నిరాశపరిచిన సందర్భాలు ఉన్నాయి. ‘శ్రీనివాస కళ్యాణం’ ‘లవర్’ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ వంటి సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి.

ఇప్పుడు ‘థాంక్యూ’ మూవీ ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. మొదటి రోజే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. పోనీ రిలీజ్ కు ముందు ఈ సినిమా పై బజ్ ఉందా అంటే అదేమీ లేదు. టీజర్, ట్రైలర్ బాగానే ఉన్నాయి కానీ జనాలను థియేటర్ కు మాత్రం తీసుకురాలేకపోయాయి. మొదటి రోజు ‘థాంక్యూ’ కి దారుణమైన కలెక్షన్లు నమోదయ్యాయి. ఇక రెండో రోజు బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. దీంతో ‘థాంక్యూ’ నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా.. దిల్ రాజు మాత్రం ‘థాంక్యూ’ మూవీని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని తెలుస్తుంది. ఆయన సినిమాలకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వస్తే వెంటనే ఒప్పుకోరు. ‘డీజే’ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది లేదు. కానీ ఈ సినిమాకి నష్టాలు వస్తే ‘ఫిదా’ తో తీర్చాను అని చెప్పారు. ఇప్పుడు ‘థాంక్యూ’ విషయంలో కూడా ఆయన వెంటనే రిజల్ట్ ను యాక్సెప్ట్ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మొదటి రోజు ‘అఖండ’ కి నెగిటివ్ టాక్ వచ్చింది, ‘ఆర్.ఆర్.ఆర్’ కి నెగిటివ్ టాక్ వచ్చింది, కె.జి.ఎఫ్ కి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది అని ఆయన చెప్పడం చూస్తే ‘థాంక్యూ’ ని వెనకేసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి అది నిజమో కాదో.. తెలియాల్సి ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!


ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus