Sandeep Reddy Bandla: మొదటి సినిమా రిలీజ్ కాకుండానే సుహాస్ దర్శకుడిపై ఈ కాన్ఫిడెన్స్ ఏంటి?

సుహాస్ (Suhas) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka)  . ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి,(Harshith Reddy) ,  హన్షిత రెడ్డి (Hanshitha Reddy)..లు నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదల కాబోతుంది. విపిన్ సంగీర్తన (Sangeerthana Vipin) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్, పాటలు బాగా ఇంప్రెస్ చేశాయి. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన హీరో పిల్లలను కనడం, పెంచడం అనేది భారంగా ఫీలయ్యి.. అందుకు సేఫ్టీపై ఆధారపడటం, అయినప్పటికీ…

Sandeep Reddy Bandla

అతని భార్య ప్రెగ్నెంట్ అవ్వడంతో.. సదరు కం*మ్ కంపెనీపై కేసు వేయడం.. ఆ తర్వాత క్రియేట్ అయ్యే ఫన్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి బండ్ల (Sandeep Reddy Bandla) డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇతని ప్రమోషన్స్ లో పెద్దగా హైలెట్ అయ్యింది ఏమీ లేదు. కానీ ఇతను బాగా టాలెంటెడ్ అని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. వాస్తవానికి ఈ కథని నాగచైతన్యతో  (Naga Chaitanya) చేయాలని అనుకున్నాడట సందీప్.

అయితే ఆ టైంకి నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’  (Love Story)  వంటి సినిమాలతో బిజీగా ఉండటం వల్ల .. అతను తప్పుకున్నట్టు చెప్పుకొచ్చాడు సందీప్. ఇక ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈ సినిమా ఫైనల్ కాపీ చూసిన నిర్మాత దిల్ రాజు  (Dil Raju) .. కొన్ని సన్నివేశాలు కట్ చేస్తే బాగుంటుందని సూచించారట. అయితే సందీప్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ‘ఉంచితే బాగుంటుంది’ అని చెప్పాడట.

అందుకు దిల్ రాజు కూడా మారు మాట్లాడకుండా ఇంకోసారి చూసి.. ‘నువ్వే కరెక్ట్’ అన్నట్టు అతన్ని అభినందించారట. అలాగే ‘సందీప్ రెడ్డి బండ్ల (Sandeep Reddy Bandla) మరో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)    అవుతాడు’ అని తన స్నేహితుల వద్ద ధీమాగా చెప్పారట దిల్ రాజు. మరి ఆయన నమ్మకం ఎంత బలమైందో అక్టోబర్ 12 న అందరికీ ఓ క్లారిటీ వస్తుంది.

1000 కోట్ల టార్గెట్ తో పుష్ప2 బిజినెస్.. హిందీ టార్గెట్ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus