Pushpa 2: 1000 కోట్ల టార్గెట్ తో పుష్ప2 బిజినెస్.. హిందీ టార్గెట్ ఎంతంటే?

అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ (Sukumar)  కాంబో క్రేజీ కాంబో కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ (Pushpa 2)  డిసెంబర్ నెల 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది. ఈ సినిమా హిందీ టార్గెట్ ఏకంగా 250 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. పుష్ప2 బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇండస్ట్రీ హిట్ కావాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకు 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని భోగట్టా.

Pushpa 2

టాలీవుడ్ లో గతంలో ఏ సినిమాకు జరగని స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరుగుతోందని ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమాకు ప్రమోషన్స్ లో కొంతమేర వేగం పెరిగితే ఈ సినిమా కలెక్షన్లు మరింత పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అల్లు అర్జున్ ఈ సినిమా కోసమే ఏకంగా మూడేళ్ల సమయం కేటాయించగా ఇకపై సినిమాల విషయంలో వేగం పెంచాలని అభిమానులు ఫీలవుతున్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా 2025 ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ (Trivikram)  మూవీ మైథలాజికల్ టచ్ తో తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

బన్నీ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అల్లు అర్జున్ సినిమాలకు అనుగుణంగా లుక్స్ ను మార్చుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. బన్నీ టాలీవుడ్ స్థాయిని పెంచే ప్రాజెక్ట్ లలో ఎక్కువగా నటిస్తున్నారు. బన్నీ భవిష్యత్తు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో బన్నీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

2 డిజాస్టర్లు ఇచ్చినా… మారుతికి అంత ఇస్తున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus