Pawan kalyan, Dil Raju: దీన్ని రాజకీయం చేయవద్దు.. చాలా సెన్సిటివ్!

  • September 30, 2021 / 02:19 PM IST

సినీ పరిశ్రమ సమస్యలపై ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రకంపనలు క్రియేట్ చేసినట్లు క్లారిటీగా అర్ధమయ్యింది. పవన్ కౌంటర్స్ తరువాత ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్‌ నిర్మాతలు బుధవారం ప్రత్యేకంగా సమావేశమై అనేక రకాల సమస్యలపై చర్చించడం జరిగినట్లు తెలిపారు. అయితే ఈ చర్చల్లో ఎక్కువగా పవన్ కు కౌంటర్ ఇచ్చే విధంగానే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అర్ధమవుతోంది. చర్చల తరువాత మంత్రితో పాటు నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు.

ఇక దిల్ రాజు మాట్లాడుతూ.. కరోనా కాలంలో చిత్ర సినీ పరిశ్రమ ఎంతగానో నష్టపోయిన విషయాన్ని వివరించామని, అలాగే పరిశ్రమపై కోవిడ్‌ ప్రభావం, థియేటర్ల సమస్యలను కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కూడా పలుమార్లు తీసుకు వెళ్లినట్లు తెలిపారు. అయితే గతంలో రాజమౌళి, నాగార్జున, చిరంజీవి అందరూ కూడా సీఎం జగన్‌ను కలిశామని.. అప్పుడు ప్రభుత్వం కూడా పాజిటివ్ గా స్పంధించినట్లు చెప్పారు. ఇక సినిమా ఇండస్ట్రీ అనేది సెన్సిటివ్ సమస్య అంటూ..

ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆ ప్రభావం నిర్మాతలపై అలాగే చాలా మందిపై పడుతుంది. అందుకే సినిమా విషయాలని రాజకీయం చేయొద్దని మీడియాను కోరుతున్నాను అని అన్నారు. అంతే కాకుండా టికెట్ల రేట్లకు ఆన్‌లైన్‌ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరామని చెప్పిన దిల్ రాజు ఆ విధానం ద్వారా ఒక అందరికి క్లారిటీ ఉంటుందని అన్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus