దిల్ రాజు పట్టిందల్లా బంగారమే అనే వారు. అంటే ఆయన తీసే ప్రతి సినిమా మంచి విజయాలు అందుకునేవి. అందుకే 50కిపైగా సినిమాలతో టాలీవుడ్‌లో పెద్ద నిర్మాతగా నిలిచారు. కానీ కొన్ని రోజులుగా ఆయన స్టోరీ జడ్జిమెంట్ సరిగా లేదు. అగ్ర హీరోలు అందులో సీనియర్ స్టార్‌ల సినిమాలు తప్ప మిగిలినవి దెబ్బకొడుతున్నాయి. ఆయన ఎంతగానో నచ్చి వేరే నిర్మాతతో కలసి తీసిన సినిమాలు తుస్ మంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన ఓ సినిమా కథలో ఇన్‌వాల్వ్ అయ్యారని తెలిసింది.
నాగచైతన్య – విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో దిల్ రాజు ‘థ్యాంక్ యూ’ అనే సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ సినిమా కథ రూపొందించే క్రమంలో తను కూడా ఇన్వాల్వ్ అయినట్లు చెప్పారు. దిల్ రాజు కథ జడ్జిమెంట్ చాలా బాగుండేదనే విషయం తెలిస్తే.. ఈ ఇన్వాల్వ్‌మెంట్ పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ ఇప్పుడు హ్యాండ్ డౌన్‌లో ఉండగా ఈ ప్రయోగాలు అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది.
మామూలుగా దిల్ రాజు సినిమా అంటే కండీషన్లు ఉంటాయి అంటారు. సినిమా కథపై చాలా చర్చలు ఉంటాయి. తన ఆస్థాన రచయితలతో కథలో లోటుపాట్లు గురించి ఓపెన్ డిస్కషన్ ఉంటుంది. కథపై, సినిమాపై టీమ్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇవన్నీ దాటుకుని సినిమా సెట్స్‌పైకి వెళ్లాలి. ఈ క్రమంలో ప్రతి మలుపు దగ్గర దిల్ రాజు ఉంటారు. అందుకే ఆయన సినిమాలు అంతగా ఆకట్టుకునేవి. అయితే ఈ మధ్య కొన్ని కథలు ఈ మలుపుల్ని దాటేసి వచ్చి ఫ్లాప్ అవుతున్నాయి. ‘థ్యాంక్ యూ’ విషయంలో మాత్రం దిల్ రాజు అన్ని విషయాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునే నెక్స్ట్ లెవల్‌కి పంపించారట.
‘‘విక్రమ్ కె కుమార్ – అఖిల్ చేసిన ‘హలో’ సినిమాలోలో ప్రేమకథ బాగుంటుంది. అయితే ఆడియన్స్‌కి సరిగ్గా రీచ్ కాలేదు. అలాగే నాని ‘గ్యాంగ్‌లీడర్’ పరిస్థితీ ఇంతే. అందులో ఉన్న లోటుపాట్లు గురించి విక్రమ్‌తో మాట్లాడాను’’ అని దిల్ రాజు చెప్పారు. ‘థాంక్‌యూ’ దగ్గరకి వచ్చేసరికి ఈ సినిమాతో జర్నీ చేస్తాను అని ఓపెన్‌గా చెప్పాను. టీమ్ డిస్కషన్‌కి విక్రమ్‌ను ఒప్పించాను అని దిల్ రాజు తెలిపారు. ఈ సమయంలో విక్రమ్ కొన్నిసార్లు ఇబ్బందిపడ్డారని, కానీ నచ్చజెప్పి ముందుకెళ్లామని దిల్ రాజు తెలిపారు.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!