Dil Raju: ఫస్ట్ టైమ్ లిమిట్స్ దాటుతున్న దిల్ రాజు

టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే గత కొంత కాలంగా ఆయన టాలీవుడ్ స్థాయిని దాటి సినిమాలను చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ మైత్రి మూవీ మేకర్స్ వంటి సంస్థల నుంచి పాన్ ఇండియా రేడియో వచ్చేస్తున్నాయి. దీంతో దిల్ రాజు కూడా అదే తరహాలో ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నారు.

ముందుగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పొలిటికల్ డ్రామాను మొదలు పెట్టబోతున్న దిల్ రాజు ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా మార్కెట్ ను అందుకోవాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాతో తో పాటు విజయ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మరొక బిగ్ బడ్జెట్ సినిమాను సెట్స్ పైకి తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ తో చేయబోయే ఐకాన్ సినిమాను కూడా అందుకు తగ్గట్టుగానే నిర్మించబోతున్నారు. ఐకాన్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే

వీలైనంత వరకు కొన్ని చిన్న సినిమాలు చేసుకుంటూనే ఇలా భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేయడానికి దిల్ రాజు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక్కో సినిమాకు రెండు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ ను కూడా కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటిసారి దిల్ రాజు తన మార్కెట్ స్థాయిని దాటి అడుగులు వేస్తున్నారు. మరి ఆ సినిమాలో ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus