‘భారతీయుడు’ కి సీక్వెల్ నిర్మించనున్న దిల్ రాజు?
- September 30, 2017 / 11:57 AM ISTByFilmy Focus
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. సమాజంలో నెలకొన్న సమస్యలను ఎత్తిచూపుతూ, అవినీతిపై పోరు నేపథ్యంలో శంకర్ తీసిన భారతీయుడు తమిళంతో పాటు తెలుగులో కూడా ఎవర్‌గ్రీన్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికి కూడా స్వతంత్రదినోత్సవం రోజు ఈ చిత్రం టెలివిషన్ వస్తూనే ఉంది. ‘భారతీయుడు’ కి సీక్వెల్ ‘ఇండియన్-2’ పేరుతో కన్ఫర్మ్ అయిపోయిందట. దీన్ని కూడా శంకరే డైరెక్ట్ చేయనున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ తో ‘రోబో-2’ పనుల్లో బిజీగా ఉన్న శంకర్ అది పూర్తవగానే ‘ఇండియన్ 2’ మొదలుపెట్టనున్నారంట. ఇక్కడ మరొక ఆసక్తికర అంశమేమిటంటే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తారట. దసరా నాడు 11గంటల సమయంలో చెన్నయ్ నుంచి ఈ సంచలన వార్త ప్రకటించాలని దిల్ రాజు అనుకున్నాడట. కానీ ఈ వార్త ట్విట్టర్ లో శనివారం ఉదయాన్నే ప్రత్యక్షమైపోయింది. ట్విట్టర్ లో లీక్ అయిపోయేసరికి, సంచలనంగా ప్రకటిద్దామనుకున్న వార్త కాస్తా, సాదా సీదాగా బయటకు వచ్చేసింది.














