‘వి’ ఫలితంతో.. ‘వకీల్ సాబ్’ విషయంలో డైలమాలో పడ్డ దిల్ రాజు..!

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. టాలీవుడ్లో దాదాపు అందరి స్టార్ హీరోలతో వర్క్ చేసాడు.. కానీ, చిరంజీవి,బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో చెయ్యలేదు. ఇప్పుడు చిరు ఎలాగూ తన సొంత బ్యానర్లోనే సినిమాలు చేసుకుంటున్నారు. ఇక బాలయ్య తో సినిమా ఇప్పట్లో కుదిరేలా లేదు. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలనే కోరిక ‘వకీల్ సాబ్’ తో తీర్చుకుంటున్నాడు దిల్ రాజు. ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది. మరో 15 రోజుల షూటింగ్ ఫినిష్ అయితే షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్టే..! ఈ చిత్రానికి దిల్ రాజు అలాగే సహా నిర్మాత బోణి కపూర్ 50 కోట్ల వరకూ బడ్జెట్ పెడుతున్నారని వినికిడి. ఇందులో పవన్ పారితోషికమే 50 కోట్లు.

అయితే ఒకేసారి అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేదట. ‘వకీల్ సాబ్’ మొదలవ్వడానికి ముందు 25 కోట్లు పవన్ కు అడ్వాన్స్ ఇచ్చారట. అటు తరువాత నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే అమౌంట్లో పవన్ కు బ్యాలన్స్ అమౌంట్ చెల్లిస్తారని తెలుస్తుంది. ఇక సినిమాకి 25 కోట్లకు మించి బడ్జెట్ అయ్యే అవకాశం లేదట. నటీనటులు కూడా తక్కువ మందే ఉంటారు కాబట్టి పారితోషికం విషయంలో కూడా ఎక్కువ ఖర్చు కాదని తెలుస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇటీవల ‘వి’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కు ఇచ్చేసాడు దిల్ రాజు. ఆ చిత్రాన్ని 33 కోట్లకు అమ్మాడట. ఆ టైములోనే పవన్ .. ‘వకీల్ సాబ్’ కు కూడా 100 కోట్లు ఆఫర్ చేశారట అమెజాన్ ప్రైమ్ వారు.

గతంలో కూడా 72 కోట్ల ‘వకీల్ సాబ్’ ను అమెజాన్లో రిలీజ్ చెయ్యమని దిల్ రాజుని అడిగారట. అప్పుడు ‘వి’ చిత్రాన్ని కూడా అమ్మడానికి ఆయన ఊపుకోలేదు. అయితే ఈసారి ‘వి’ ని 33కోట్లకు అమ్మేస్తున్నాడు కాబట్టి.. పనిలో పనిగా ‘వకీల్ సాబ్’ ను కూడా 100 కోట్లకు ఇస్తాడేమో అని వారడిగారట. అప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా దిల్ రాజు నో చెప్పాడని సమాచారం. పవన్ తో సినిమా చేసి ఓటిటి రిలీజ్ చేయడమేంటి అని ఫీలయ్యారు. అయితే ఇటీవల విడుదలైన ‘వి’ చిత్రం ఫలితాన్ని బట్టి.. ‘వకీల్ సాబ్’ విషయంలో కూడా నో చెప్పడం కరెక్ట్ కాదేమో అని దిల్ రాజు ఫీలవుతున్నారట. అంతేలెండి 100 కోట్ల ఆఫర్ ను రిజెక్ట్ చెయ్యడానికి ఏ నిర్మాతకు మనసు రాదు కదా.!

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus