సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది ప్రముఖ సినీ సెలబ్రిటీలను అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థల పేర్లు చెబుతూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది ఇలా బడా సంస్థల పేర్లతో మోసపోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన ఓ వార్త గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం Rc 15 కోసం కాస్టింగ్ కాల్ అంటూ ఓ ప్రకటన వెలువడింది.
ఈ క్రమంలోనే ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ విషయం నిర్మాత దిల్ రాజు వరకు చేరడంతో ఈ విషయంపై దిల్ రాజు స్పందించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ కాస్టింగ్ కాల్ గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని అలాంటి వార్తలను ఎవరు నమ్మి మోసపోవద్దంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు. RC15/SVC50 సినిమాల నిమిత్తం ఆర్టిస్ట్ కాస్టింగ్ కాల్ ఇచ్చామనేది పూర్తిగా ఫేక్ అని తెలియచేసారు.
మా తరుపున ఏ కంపెనీ కానీ ఏజెన్సీ కానీ ఏ ఆర్ధరైజెడ్ పర్శన్స్ కానీ పనిచేయటం లేదు. ఇలాంటి వార్తలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రామ్ చరణ్ కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా 50% షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంది.
ఈ సమయంలోనే ఈ సినిమా నుంచి కాస్టింగ్ కాల్ అనే వార్తలు రావడంతో ఈ వార్తలపై దిల్ రాజు స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారిగా కనిపించడంతో ఈ సినిమాకి అధికారి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే త్వరలోనే ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన క్లారిటీ రానుంది.