భారీ వసూళ్లు పోస్టర్లు.. సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ వార్లు.. మారండయ్యా బాబూ!

సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్‌ వార్స్‌ కొత్తేమీ కాదు. ఒకప్పుడు ఆఫ్‌లైన్‌లో ఈ రొచ్చు ఉండేది.. ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే సోషల్‌ మీడియాలోకి వచ్చేసింది. అభిమానం పేరుతో కొంతమంది ఉన్మాదం సృష్టిస్తున్నారు. నోటికొచ్చింది వాగడం, పక్కనే నిల్చుని అంతా చూసినట్లు హీరోల గురించి, హీరోయిన్ల గురించి చెప్పడం, సినిమా సెట్స్‌లో ఉన్నట్లు మాట్లాడటం చూశాం. దీని వల్ల ఒకరినొకరు తిట్టుకోవడం, ఒక్కోసారి శ్రుతి మించడం చూసే ఉంటాం.

ఇవన్నీ మాకు తెలుసు. మనం రోజూ చూస్తున్నవే కదా అంటారా? అవును రోజూ చూస్తున్నవే. ఇలాంటి ఫ్యాన్‌ వార్స్‌కి ఆయా వ్యక్తులే ఇన్నాళ్లూ కారణం. సినిమా 50 రోజుల పోస్టర్లు, 100 రోజుల పోస్టర్లు కూడా దీనికి కారణం అని చెప్పొచ్చు. థియేటర్లలో సినిమా ఆ రోజుకు లేకపోయినా ఆ లిస్టుల్లో వాళ్ల ఊరు థియేటర్లు ఉండటంతో ఫ్యాన్స్‌ మధ్య లేనిపోని గొడవలు వచ్చేవి. ఇప్పుడు ఎలాగూ సినిమా అన్ని రోజుల ఆడటం లేదు కాబట్టి సమస్య లేదు.

కానీ ఇప్పుడు మరో లిస్ట్‌లు అభిమానుల మధ్యలో లేని పోని సమస్యలను కారణమవుతున్నాయి. అవే కలక్షన్ల పోస్టర్లు. సినిమా విడుదలైన రెండో రోజు నుండి ఓ రెండు వారాలు ఈ లేనిపోని చర్చ ఉంటోంది. తమ సినిమాకు ఇంత కలెక్షన్లు వచ్చాయి అంటూ నిర్మాతలు, రిలీజ్‌ చేసే నిర్మాతలు గొప్పలు పోతున్నారు. నిజంగా అంతే వచ్చాయా అనే డౌట్‌తో వేరే హీరోల ఫ్యాన్స్‌.. ఆ హీరో ఫ్యాన్స్‌తో గొడలవలకు దిగుతున్నారు. ముఖాలు దాచుకుని, పేర్లు మార్చుకుని నోటికొచ్చింది, చేతికొచ్చింది రాస్తున్నారు.

కొన్ని రోజుల తర్వాత మేం చెప్పిన వసూళ్ల లెక్కలు తప్పు, ఫ్యాన్స్‌ కోసమే ఇదంతా చేశాం అని ఆ నిర్మాత చెబుతున్నారు. అప్పటికి జరగాల్సిన తప్పులు, నొప్పులు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఓ మార్పు అయితే పక్కాగా రావాలి అని సగటు సినిమా అభిమాని అంటున్నాడు. అసలు నెంబర్లు చెప్పి చూడండి ఫ్యాన్‌ వార్‌ అనేది మరోసారి తెలుగు పరిశ్రమను ముంచకుండా ఉంటుంది అని చెబుతున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నిర్మాతలే.

గేమ్ ఛేంజర్ నెంబర్లపై కన్ఫ్యూజన్.. రాజుగారేమంటారో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus