Dil Raju: మళ్ళీ దిల్ రాజుని విసిగిస్తున్న శంకర్..ఏమైందంటే?

రాంచరణ్ – శంకర్ కాంబినేషన్లో ‘గేమ్ ఛేంజ‌ర్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఆయన బ్యానర్ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లో రూపొందుతున్న 50 వ సినిమా ఇది. అందుకే భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శంకర్ అంటేనే భారీ బడ్జెట్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ లాంటి వారు. ఆయన అద్భుతమైన దర్శకుడే కానీ నిర్మాతల్ని మాత్రం పిండేస్తుంటాడు అనే పేరుంది.

రూపాయి ఖర్చు పెట్టించాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టడం శంకర్ కి బాగా అలవాటు. దిల్ రాజు తన 50 వ సినిమాని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు శంకర్ కి ముందుగానే చెప్పడం.. ఇప్పుడు అతనికి లేని పోని తలనొప్పులను తీసుకొచ్చింది అని చెప్పాలి. తమిళంలో శంకర్ తో సినిమా చేయడానికి నిర్మాతలు మొహం చాటేస్తున్నారు. ఇలాంటి టైంలో శంకర్ కి దిల్ రాజు దొరికాడు. సినిమా సగం షూటింగ్ కంప్లీట్ అవ్వకుండానే దిల్ రాజు (Dil Raju) పెట్టిన బడ్జెట్ టార్గెట్ కి మించి ఖర్చు చేయించాడు శంకర్.

అది చాలదు అన్నట్లు ‘ఇండియన్ 2 ‘ సినిమా కూడా కంప్లీట్ చేయాల్సి రావడంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాని అతను సరిగ్గా పట్టించుకోవడం లేదు అని టాక్. సెట్ కి ఎక్కువ రావడం లేదట. ఈ మధ్య జరిగిన షూటింగ్ లో రోజంతా అందరినీ ఎంతో క‌ష్ట‌పెట్టి తీసిన షాట్స్ అన్నీ పక్కన పెట్టేసాడట. అలాగే అతను షూటింగ్ కి రాకపోగా లైవ్ లో అతను డైరెక్షన్ చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్.

‘గేమ్ ఛేంజర్’ కోసం `హిట్` ఫేమ్ శైలేష్ కొల‌ను ని కూడా రంగంలోకి దించారట. అతను కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నట్టు వినికిడి. ఇలాంటి వ్యవహారాలు అన్నీ దిల్ రాజుకి చిరాకు తెప్పిస్తున్నాయి. అయినా అతను చేసేదేమీ లేదు. కొంతకాలంగా తమిళ దర్శకులు ఇలాగే తెలుగు నిర్మాతల్ని నలిపేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం లేదు. ఇక్కడ తెలుగు నిర్మాతలను బకరాలని చేసి ఆడిస్తున్నారు. ఒక్క సముద్రఖని మాత్రమే ‘బ్రో’ ని చెప్పిన బడ్జెట్ లో, చెప్పిన టైంకి తీశాడు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus