Dil Raju: అమెరికా తరహాలో తెలుగు రాష్ట్రాల్లో రెంట్రాక్
- June 12, 2025 / 04:12 PM ISTByDheeraj Babu
ట్విట్టర్లో సగం ఫ్యాన్ వార్లు ఆగిపోయే మార్గాన్ని తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయనున్నారు దిల్ రాజు (Dil Raju). అదే రెంట్రాక్, ఆల్రెడీ అమెరికాలో చాలా యాక్టివ్ గా ఉన్న ఈ రెంట్రాక్ సిస్టమ్ ను తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు దిల్ రాజు. ఈ విషయమై అల్రెడీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ప్రతిపాదన తీసుకొచ్చానని, త్వరలోనే ఆది అమలయ్యే అవకాశాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
Dil Raju
దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ & సినిమా అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఒకరికి తెలియకుండా మరొకరు భుజాలు తడుముకున్నారు.ఇక్కడ అసలు సమస్య రెంట్రాక్ ను ఇండియాలో ప్రవేశపెట్టడమో, ఒరిజినల్ కలెక్షన్స్ ను బయటపెట్టడమో కాదు.. దిల్ రాజు ఆ పని చేయడం. ఎందుకంటే.. ప్రస్తుతం దిల్ రాజు (Dil Raju) నేతృత్వంలో మూడు ప్రొడక్షన్ బ్యానర్లు నడుస్తున్నా.. సదరు సంస్థల నుండి ఏడాదికి వచ్చే సినిమాలు మహా అయితే 5.

అదే వేరే సంస్థలు ఏడాదికి నిర్మించే సినిమాలు ఏడెనిమిది ఉంటాయి. దాంతో.. వేరే నిర్మాణ సంస్థల ప్రతినిధులు, నిర్మాతలు, హీరోలు ఈ విషయంలో దిల్ రాజు (Dil Raju) మీద డైరెక్ట్ గా కాకపోయినా, ఇండైరెక్ట్ గా అక్కసు కక్కే అవకాశాలు లేకపోలేదు.

ఈ రెంట్రాక్ సిస్టమ్ వల్ల తెలుగు చిత్రసీమ ఎంత బాగుపడుతుంది అనే విషయం పక్కన పెడితే.. సగం ఫ్యాన్ వార్స్ ఆగిపోతాయి, తమ హీరో డే1 కలెక్షన్స్ తోపు అనుకుని బేరాలు పోయే ఫ్యాన్స్ అందరూ సైలెంట్ అయిపోతారు. అందువల్ల ట్విట్టర్ లో కాస్తయినా నెగిటివిటీ తగ్గుతుంది. మరి దిల్ రాజు (Dil Raju) ఈ పద్ధతిని ఎంత త్వరగా అమలుపరుస్తారు, దానికి అందరూ అంగీకరిస్తారా?, ముఖ్యంగా స్టార్ హీరోలు ఈ పద్ధతిపై ఎంతవరకు సుముఖత చూపుతారు? అనేది చూడాలి.













