Dil Raju: గేమ్ ఛేంజర్ తో దిల్ రాజులో వచ్చిన మార్పు ఇండస్ట్రీకి మంచిదేనా?
- June 12, 2025 / 03:49 PM ISTByDheeraj Babu
తెలుగు సినిమా నిర్మాణ రంగంలో సరికొత్త ఒరవడి సృష్టించిన వ్యక్తి దిల్ రాజు (Dil Raju) . డిస్ట్రిబ్యూటర్ గా మంచి అనుభవం సంపాదించి, సినిమాను, సినిమా పరిశ్రమను అర్థం చేసుకుని నిర్మాణ రంగంలోకి అడుగిడారు దిల్ రాజు. నిర్మాతగా వరుస విజయాలు, భారీ బ్లాక్ బస్టర్లు, అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ మర్చిపోతున్న మల్టీస్టారర్ లను మళ్లీ మనుగడలోకి తీసుకొచ్చింది కూడా దిల్ రాజే (Dil Raju) . అలాంటి దిల్ రాజు గత కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయారు.
Dil Raju
ఒకప్పుడు దిల్ రాజు (Dil Raju) పేరు, బ్యానర్ పేరు చూసి థియేటర్లకి పరుగులు తీసిన జనం, ఈమధ్యకాలంలో ఆయన ఛాయిస్ లను నమ్మడం మానేశారు.తన సినిమాల్లో కంటెంట్ మిస్ అవుతుందనే విషయాన్ని దిల్ రాజు (Dil Raju) “గేమ్ ఛేంజర్” (Game Changer) తో గ్రహించారో లేక నిర్మాతగా తన పూర్వ వైభవం సంపాదించుకోవాలని ఫిక్స్ అయ్యారో తెలియదు కానీ.. నిన్న “తమ్ముడు” (Thammudu) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడిన విషయాలు, డిస్కస్ చేసిన అంశాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారాయి.

ట్రైలర్ వ్యూస్ కొనకండి అంటూ నిర్మాతలకు సూచన ఇవ్వడం మొదలుకొని, తాను చేసిన తప్పులు స్టేజ్ మీద అంగీకరించడం, స్టార్ హీరోల రెమ్యునరేషన్ల గురించి ఓపెన్ గా మాట్లాడడం అనేది ఇండస్ట్రీకి ప్రస్తుతం చాలా అవసరం. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో గత ఆరు నెలల్లో కేవలం 4 హిట్లు వచ్చాయి అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనేది అర్థం చేసుకోవాలి అని దిల్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ వెనుక చాలా బాధ ఉంది.
దిల్ రాజు (Dil Raju) లో వచ్చిన ఈ మార్పు కచ్చితంగా ఇండస్ట్రీకి మంచిదే.
దిల్ రాజు (Dil Raju) లో వచ్చిన ఈ మార్పు కచ్చితంగా ఇండస్ట్రీకి మంచిదే.

అయితే.. ఎంతమంది నిర్మాతలు ఈ మార్పుని అలవరుచుకోగలరు అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకం. ఎందుకంటే.. ఈమధ్యకాలంలో ట్రైలర్ & ప్రమోషనల్ కంటెంట్ బూస్ట్ చేస్తే తప్ప వ్యూస్ రావడం లేదు మరియు ఆడియన్స్ కి రీచ్ అవ్వడం లేదు. దిల్ రాజు (Dil Raju) కి కుదిరినట్లుగా అందరూ నిర్మాతలకు హీరోలతో ప్రాఫిట్ షేరింగ్ కుదరకపోవచ్చు. అయితే.. ఈ సమస్యలను అధిగమించగలిగితే తెలుగు చిత్రసీమ కచ్చితంగా ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. మరి మిగతా ఇండస్ట్రీ పెద్దలు, నిర్మాతలు దిల్ రాజు కామెంట్స్ & స్టేట్మెంట్స్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















