కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గతేడాది ‘క’ (KA) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక ఈ ఏడాది ‘దిల్ రుబా’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫిబ్రవరి నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా టీజర్ ని వదిలారు. 1:41 నిడివి కలిగి ఉంది ‘దిల్ రుబా’ (Dilruba) టీజర్. ‘మ్యాగీ నా ఫస్ట్ లవ్.. మార్చ్ లో ఎగ్జామ్స్ ఫెయిల్ అయినట్టు మ్యాగీతో లవ్ లో ఫెయిల్ అయ్యాను.
Dilruba Teaser Review
మార్చి పోతే సెప్టెంబర్ వచ్చినట్టు .. తర్వాత నా లైఫ్లోకి అంజలి వచ్చింది’ అంటూ కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్లో టీజర్ మొదలైంది. ఆ తర్వాత హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) ఎంట్రీ.. హీరోతో ప్రేమాయణం, రొమాన్స్ వంటివి చూపించారు. ఇక తర్వాత ‘నా చేతిలో గన్ ఉంటే కాల్చి పడదొబ్బేవాడిని అంటూ హీరో.. హీరోయిన్ కి వార్నింగ్ ఇస్తే, అటు తర్వాత ‘రేపు తీసుకొస్తా వేసెయ్యి’ అంటూ హీరోయిన్ పలకడం అనేది పూరి జగన్నాథ్ సినిమాల స్టైల్లో ఉంది.
టీజర్ కి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హైలెట్ అయ్యింది సామ్ సి ఎస్ (Sam C. S.) మ్యూజిక్. చాలా ఫ్రెష్ గా అనిపించింది. తర్వాత సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కొన్ని విజువల్స్ క్వాలిటీగా అనిపించాయి. అయితే టీజర్లో చాలా సీన్లు రామ్ చరణ్ (Ram Charan) ‘ఆరెంజ్’ (Orange) , పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)..ల ‘హార్ట్ ఎటాక్’ (Heart Attack) ‘ఇద్దరమ్మాయిలతో’ (Iddarammayilatho) సినిమాలను గుర్తు చేసే విధంగా ఉన్నాయి. బహుశా దర్శకుడు విశ్వ కరుణ్ .. పూరీ జగన్నాథ్ ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :