సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కెరీర్లో చాలా మైల్ స్టోన్ మూవీస్ ఉన్నాయి. అందులో ఒకటి ‘దళపతి’ (Thalapathi) సినిమా అని చెప్పాలి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘జీవీ ఫిలిమ్స్’ బ్యానర్ పై జి.వెంకటేశ్వరన్ (G. Venkateswaran) ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కూడా ఈ సినిమాలో మరో హీరోగా నటించడం విశేషంగా చెప్పుకోవాలి. 1991 నవంబర్ 5న ఈ చిత్రం తమిళంలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. అక్కడ భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో కొంత గ్యాప్ తర్వాత తెలుగులో కూడా డబ్ చేశారు. తెలుగు వెర్షన్ 1992 జనవరి 3న రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా ‘దళపతి’ (Dalapathi) సినిమా సూపర్ హిట్ అయ్యింది.
Dalapathi
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చిన్నప్పుడే తల్లికి దూరమైన సూర్య(రజినీకాంత్) ను కొందరు చేరదీసి పెంచుతారు. తర్వాత ఓ గొడవ వల్ల అతనికి దేవరాజ్(మమ్ముట్టి) స్నేహితుడవుతాడు. అతను పెద్ద దాదా. అయినప్పటికీ మంచి కోసం పోరాడుతూ ఉంటాడు. దానికి సూర్య తోడవ్వడం వల్ల అతని బలం పెరుగుతుంది. శత్రువులు కూడా పెరుగుతారు. ఆ తర్వాత దేవరాజ్ సవతి తమ్ముడు, ఐఏఎస్ అధికారి అయిన అర్జున్(అరవింద్ స్వామి) (Arvind Swamy) దేవరాజ్, సూర్య..లని చట్టానికి పట్టించాలనుకుంటాడు. దాన్ని విలన్ గ్యాంగ్ ఎలా ఉపయోగించుకుని దేవరాజ్, సూర్య..లని వేరు చేశారు అనేది మిగిలిన కథ.
వాస్తవానికి మణిరత్నం ఈ కథని ‘మహాభారతం’ స్ఫూర్తితో రాసుకున్నాడట. దుర్యోధనుడు, కర్ణుడు..ల మధ్య ఉన్న స్నేహాన్ని.. వారికి అర్జునుడు వల్ల ఆపద వంటి వాటిని..ఆధారం చేసుకుని ‘దళపతి’ ని మలిచాడు మణిరత్నం. దేవరాజ్ పాత్ర దుర్యోధనుడుని పోలి ఉంటుంది. సూర్య పాత్ర కర్ణుడిని, అర్జున్ పాత్ర అర్జునుడిని పోలి ఉంటుంది. దీనికి లవ్ స్టోరీని అలాగే మదర్ సెంటిమెంట్ ను హృద్యంగా జోడించి చాలా గొప్పగా తీర్చిదిద్దాడు మణిరత్నం.
టెక్నికల్ గా కూడా ‘దళపతి’ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సంతోష్ శివన్ (Santosh Sivan) సినిమాటోగ్రఫీ సూపర్. ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతంలో రూపొందిన పాటలు.. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది.
మహేష్ బాబు ఓ సందర్భంలో ‘దళపతి’ సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడినట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.