Anil Ravipudi: కళ్యాణ్ రామ్ వల్లే నాకు ఈ స్థాయి అన్న అనిల్.. రుణపడి ఉంటానంటూ?

కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన పటాస్ (Pataas) మూవీ 2015 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచింది. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో పటాస్ సినిమాలో హీరో రోల్ కు పవన్ ఇంకా బాగా సూట్ అయ్యేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఈ కామెంట్ల గురించి అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు.

పటాస్ మూవీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసి ఉంటే అదొక వేరే టైమ్ ఆఫ్ సినిమా అయ్యేదని అన్నారు. పవన్ కళ్యాణ్ చేయలేదు కాబట్టి పటాస్ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ విషయంలో నేను హ్యాపీ అని అనిల్ రావిపూడి అన్నారు. నేనెవరిని అని వెనక్కు తిరిగి చూసుకుంటే పటాస్ అని ఆ సినిమా లేకపోతే నా సినిమాలేవీ లేవని అనిల్ రావిపూడి వెల్లడించడం గమనార్హం.

పటాస్ సమయంలో కళ్యాణ్ రామ్ ఓం త్రీడీ (Om 3D) సినిమా వల్ల ఆర్థికంగా భారీ స్థాయిలో నష్టపోయి ఉన్నారని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. నన్ను నమ్మి కళ్యాణ్ రామ్ లైఫ్ ఇచ్చారని కళ్యాణ్ రామ్ కు నేను రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. నేను ఎన్నిసార్లు వెనక్కు తిరిగి చూసుకున్నా పటాస్ స్పెషల్ మూవీ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. భగవంత్ కేసరి (Bhagavanth Kesari) హిట్ తర్వాత అనిల్ రావిపూడి వెంకటేశ్ తో సినిమా తీస్తున్నారు.

వెంకటేశ్ (Venkatesh Daggubati) అనిల్ రావిపూడి కాంబో హిట్ కాంబో కావడంతో ఈ కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. దిల్ రాజు ఈ కాంబో సినిమాకు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus