Bharathiraja: దయచేసి అలా చేయవద్దు: భారతీరాజా

ప్రముఖ సీనియర్‌ దర్శకుడు భారతీరాజా ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యారు. అనారోగ్య కారణాలతో ఆయన కొద్ది రోజుల క్రితమే ఆస్పత్రిలో చేరగా, తాజాగా ఆయన చేసిన రిక్వెస్ట్‌తో ఈ విషయం బయటికొచ్చింది. దీంతో భారతీరాజాకు ఏమైంది అని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ‘‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. ఆస్పత్రిలో అనుమతి లేనందువల్ల ఎవరూ నన్ను చూడటానికి రావొద్దు’’ అంటూ భారతీరాజా కోరారు. అస్వస్థతతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన భారతీరాజాను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

భారతిరాజా ఆరోగ్యంపై పెద్దఎత్తున వార్తలు రావడంతో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను బాగానే ఉన్నాను. త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగివచ్చి అందర్నీ కలుస్తాను’’ అని ఆ ప్రకటనలో తెలిపారు భారతీరాజా. మరోవైపు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు శనివారం సాయంత్రం ఒక హెల్త్‌ బులెటిన్‌ను కూడా విడుదల చేశాయి. ‘‘భారతీరాజా మా ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్సలు అందిస్తోంది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌లో పేర్కొన్నాయి. ‘‘అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో నేను ఆసుపత్రిలో చేరిన సంగ‌తి అందరికీ తెలిసిందే. డాక్ట‌ర్స్ చికిత్స‌తో నేను చాలా త్వ‌ర‌గా కోలుకుంటున్నాను. కొంద‌రు నాపై ప్రేమ‌తో హాస్పిట‌ల్‌కు వ‌స్తున్నారు. మీ ప్రేమాభిమానాలు నాకు అర్థ‌మ‌వుతున్నాయి. అయితే అలా అందరూ రావడం వల్ల ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగే అవ‌కాశముంది. ఇప్పుడు ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు.

కాబ‌ట్టి ద‌యచేసి నా కోసం హాస్పిట‌ల్‌కి రాకండి. ఆరోగ్యం కుదుటప‌డిన త‌ర్వాత నేనే అందరినీ క‌లుస్తాను’’ అని భారతీరాజా లేఖలో పేర్కొన్నారు.మరోవైపు భారతీరాజా ఆనారోగ్యం వార్తలతో సినిమా పరిశ్రమలో పెద్దలు ఎప్పటికప్పుడు ఏమైందా అనేది కనుక్కుంటున్నారు. ఆయన సన్నిహితులు అన్ని పరిశ్రమల్లో ఉన్న విషయం తెలిసిందే. భారతీరాజా త్వరగా కోలుకొని రావాలని ఆకాంక్షిస్తున్నారు. అభిమానులు సైతం భారతీరాజా కోలుకోవాలని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus