Waltair Veerayya: మెగాస్టార్ ఎంట్రీ ఎలా ఉంటుందో చెప్పిన డైరెక్టర్!

సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాపై బజ్ ఏ రేంజ్ లో ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీటికి సంబంధించిన ఏ విషయమైనా.. అభిమానుల్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తుంది. చిరంజీవి, బాలయ్య బాక్సాఫీస్ వద్ద తలపడుతుండడంతో ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ మాములుగా లేదు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్ లో జరిగిన మెగా ఫ్యాన్స్ సమావేశానికి ‘వాల్తేర్ వీరయ్య’ నిర్మాతతో పాటు దర్శకుడు బాబీ, తెలుగు రాష్ట్రాల అభిమాన సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

ప్రైవేట్ మీటింగ్ గా సాగిన ఈ చర్చల్లో చాలా అంశాల గురించి మాట్లాడుకున్నారు. ముఖ్యంగా థియేటర్లు, బెనిఫిట్ షోల గురించి చర్చించుకున్నారు. దర్శకుడు బాబీ తన స్పీచ్ లో కీలకమైన చిరంజీవి ఇంట్రో గురించి లీక్ చేశారు. పదిరోజుల పాటు భారీ వర్షంలో బోటు మీద చిరంజీవి పరిచయ సన్నివేశాన్ని చిత్రీకరించామని.. అందరూ చలికి వణుకుతుంటే.. చిరంజీవి మాత్రం అలానే పాల్గొని డూప్ అవసరం లేకుండా నటించారని.. ఫుల్ ఎలివేషన్లు ఇచ్చారు.

ఇలాంటి సన్నివేశాలు సినిమాలో గ్యాప్ లేకుండా వస్తూనే ఉంటాయని చెప్పారు. మెగాస్టార్ అభిమాని ఆయన్ను ఎలాగైతే చూడాలనుకుంటారో.. అంతకుమించి సినిమా ఉంటుందని చెప్పారు. సినిమా రిలీజ్ కు ముందు దర్శకులు ఇలా మాట్లాడడం సహజమే. దర్శకుడు బాబీకి ఈ సినిమా సక్సెస్ చాలా ముఖ్యం. బాబీ తెరకెక్కించిన ‘జై లవకుశ’, ‘వెంకీ మామ’ సినిమాలు కమర్షియల్ గా వర్కవుట్ అయినప్పటికీ..

ఆ హీరోల ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునేలా స్క్రిప్ట్స్ రాసుకోలేకపోయారనే కామెంట్స్ వినిపించారు. అందుకే ఈసారి చిరంజీవితో పాటు రవితేజను కూడా తీసుకొచ్చి భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. ఈ సినిమా గనుక హిట్ అయితే బాబీకి స్టార్ హీరోల నుంచి ఆఫర్లు క్యూ కట్టడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి!

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus