Mokshagna Teja: బాలయ్య ఫ్యాన్స్ కోరిక త్వరలో తీరనుందా..?

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితమే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ వార్తలు నిజం కాలేదు. అయితే బాలయ్య మోక్షజ్ఞ కోసం కథలు వింటున్నారని స్టార్ డైరెక్టర్ మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు ఫిక్స్ అయ్యారని బాలయ్య సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఉప్పెన సినిమాతో హిట్ కొట్టిన బుచ్చిబాబు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు మెగాహీరో వైష్ణవ్ తేజ్ కు నటుడిగా మంచి పేరు వచ్చేలా చేశారు. తొలి సినిమాతోనే క్లాస్ అంశాలతో కూడిన మాస్ కథలను అద్భుతంగా తెరకెక్కించగలరని ప్రూవ్ చేసుకున్నారు. ఉప్పెన సినిమా తరువాత బుచ్చిబాబు కొత్త సినిమాకు కమిటవలేదు. స్టార్ హీరోలతో బుచ్చిబాబు సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నా ప్రస్తుతం స్టార్ హీరోలంతా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలకృష్ణ పూరీ జగన్నాథ్ పేరును కూడా పరిశీలిస్తున్నారని సమాచారం.

స్టార్ హీరో రామ్ చరణ్ ను ఇండస్ట్రీకి పూరీ జగన్నాథ్ పరిచయం చేశారనే సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ తన సినిమాల్లో హీరోను సింపుల్ గా చూపిస్తారు. ఈ ఏడాదే మోక్షజ్ఞ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఫస్ట్ మూవీ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus