Kabir Khan: స్టార్‌ హీరో కోసం 14 దేశాల స్టంట్‌ మాస్టర్‌లు.. షాకిచ్చిన డైరక్టర్‌.!

  • August 17, 2024 / 02:24 PM IST

మన దగ్గర ఓ పెద్ద సినిమాకు హాలీవుడ్ సాంకేతిక నిపుణుడు ఒకడు పని చేస్తే.. మొత్తంగా హాలీవుడ్‌ వచ్చి తమ సినిమాకు పని చేస్తోంది అనేలా హడావుడి చేసే జనాలు ఉన్న రోజులివి. ఇప్పుడు ఈ ఎలిమెంట్‌ పెద్ద ప్రచారాస్త్రం అయింది కూడా. అలాంటిది ఓ సినిమాలో యాక్షన్‌ సీన్‌ కోసం 14 దేశాలకు చెందిన స్టంట్‌ మాస్టర్‌లు పని చేస్తున్నారు అంటే.. అది ఎంత పెద్ద విషయం చెప్పండి. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇప్పుడు చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చారు దర్శకుడు.

Kabir Khan:

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ తన స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఏక్‌ థా టైగర్‌’. కబీర్‌ ఖాన్‌ (Kabir Khan) దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) హీరోగా ఈ సినిమా రూపొందింది. టైగర్, జోయా ప్రేమకథ ఈ సినిమాకు ఓ హైలైట్‌ కాగా.. టైగర్‌ పాత్రలో సల్మాన్‌ యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు మరో ఆకర్షణ అని చెప్పాలి. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ గురిచే ఇప్పుడు కబీర్‌ ఖాన్‌ మాట్లాడారు. ఆ మాటలే వైరల్‌గా మారాయి కూడా.

‘ఏక్‌ థా టైగర్‌’ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాల వెనక 14 దేశాలకు చెందిన స్టంట్‌ మాస్టర్స్‌ కృషి ఉందని కబీర్‌ ఖాన్‌ చెప్పారు. ఈ సినిమా విడుదలై 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కబీర్‌ ఈ విషయాలు చెప్పుకొచ్చారు. యశ్‌రాజ్‌ సంస్థలో రూపొందుతున్న మొదటి యాక్షన్‌ చిత్రమిది. అందుకే ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దాం. అందులో భాగంగానే 14 దేశాల నిపుణులతో యాక్షన్‌ సీన్స్‌ చేశామని చెప్పారు కబీర్‌.

ఇక రూ. 75 కోట్లతో రూపొందిన ఈ సినిమా అప్పట్లోనే రూ.335 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఈ సినిమాకు ‘టైగర్‌ జిందా హై’, ‘టైగర్‌ 3’ (Tiger 3) అని రెండు సీక్వెల్స్‌ కూడా వచ్చిన విషయం తెలిసిందే. వసూళ్ల పరంగా రెండో పార్టు బ్లాక్‌ బస్టర్‌ కాగా.. మూడో పార్టు ఓకే అనిపించుకుంది.

అప్పుడు మాత్రమే అక్కడికి వెళ్తా.. హాలీవుడ్‌ ఎంట్రీపై స్టార్‌ హీరో కామెంట్స్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus