Kv Anudeep: వింత వ్యాధితో బాధపడుతున్న ‘జాతి రత్నాలు’ దర్శకుడు!

పలు కామెడీ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టి.. ‘పిట్టగోడ’ అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు కె.వి.అనుదీప్. మొదటి చిత్రం పెద్దగా ఆడకపోయినా రెండో చిత్రం ‘జాతి రత్నాలు’ మాత్రం మంచి దర్శకుడిగా అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ ఒక్క చిత్రంతో ఇతను యూత్ లో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అటు తర్వాత శివ కార్తికేయన్ తో ‘ప్రిన్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి ఇండియా వైడ్ ట్రెండింగ్లో నిలిచాడు కానీ…

ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ అనుదీప్ పేరు తమిళంలో కూడా మార్మోగింది. కామెడీ సినిమాలు తీస్తున్నప్పటికీ అనుదీప్ చాలా సీరియస్ గా ఉంటాడు. అందుకు ఓ కారణం కూడా ఉందని టాక్. అతను అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడట.ఈ విషయం స్వయంగా అనుదీప్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అతను మాట్లాడుతూ.. “నాకు హైలీ సెన్సీటీవ్‌ పర్సన్‌ (హెచ్‌ఎస్‌పీ) అనే డిజార్డర్‌ ఉంది. ప్రతి ఒక్కరిలో ఈ డిజార్డర్‌ లక్షణాలుంటాయి కానీ అర్ధం చేసుకోలేరు.

నా శరీరంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో నేను ఈ వ్యాధి గురించి తెలుసుకున్నాను. నాకు గ్లూటెన్‌ పడడు..కాబట్టి కాఫీ తాగితే రెండు రోజుల పాటు నిద్ర రాదు. ఏదైనా పళ్ల రసం తాగితే మైండ్‌ కామ్‌ అవుతుంది. ఈ డిజార్డర్‌ ఉన్న వారి సెన్సెస్‌ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయి.. ఎక్కువ కాంతి వంతమైన లైట్లు చూసినా, ఘాటైన వాసనలు తగిలినా తట్టుకోలేరు. ఈ వ్యాధి ఉన్నవారు.. చాలా త్వరగా అలసిపోతారు.

ఇది శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదు. దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో పరిశోధించి.. ప్రస్తుతం అదే ఆహారం తీసుకుంటున్నాను.నాకు భవిష్యత్తులో హెచ్‌ఎస్‌పీ గురించి సినిమా తీసే ఆలోచన కూడా ఉంది. దాని వల్ల కొందరైనా హీల్‌ అవుతారనేది నా అభిప్రాయం” అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అనుదీప్.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus