Prabhas: సైలెంట్ గా ప్రభాస్ తో సినిమా ఓకే చేయించుకున్నాడా..?

‘ బాహుబలి'(సిరీస్) తర్వాత ప్రభాస్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు మరియు వాటి దర్శకుల గురించి తెలుస్తుంటే అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా మైండ్లో ఒక్కటే అనిపిస్తుంది.. ‘ప్రభాస్ కు ఏమైంది? అతను పాన్ ఇండియా స్టార్ అనే విషయం మర్చిపోయాడా?’ అని.! చిన్న డైరెక్టర్లకు పెద్ద బడ్జెట్ పెట్టే నిర్మాతల్ని కట్టబెట్టి.. కోట్లకు కోట్లు వృధా చేయిస్తున్నాడు. అలాగే అతని ఇమేజ్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఒక్క ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘సలార్’ ను తీసేస్తే..

నాగ్ అశ్విన్, ఓం రౌత్, మారుతి వంటి దర్శకులు ప్రభాస్ ఇమేజ్ ను మ్యాచ్ చేసే దర్శకులు కాదు. కానీ వాళ్లకు అవకాశాలు ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుల పై అభిమానులకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అనేది వాస్తవం. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే ఇప్పుడు మరో ప్లాప్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. అతను మరెవరో కాదు అనుదీప్ కె.వి. ‘పిట్టగోడ’ చిత్రంతో దర్శకుడిగా మారిన ఇతను అటు తర్వాత ‘జాతి రత్నాలు’ అనే లాటరీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

దీని రిజల్ట్ ను చూపించి ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ను బుట్టలో వేసుకున్నాడు. అతనితో చేసిన ‘ప్రిన్స్’ మూవీ అటు తమిళ్ లో కానీ తెలుగులో కానీ సక్సెస్ అవ్వలేదు. రిజల్ట్ పక్కన పెట్టేస్తే అసలు శివ కార్తికేయన్.. అనుదీప్ తో సినిమా చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికే అంతా తలకొట్టుకుంటూనే అనుదీప్ సైలెంట్ గా ప్రభాస్ నే లైన్లో పెట్టేశాడు అని ఇన్సైడ్ టాక్.నాగ్ అశ్విన్ తో ఉన్న చనువుతో ‘ప్రాజెక్టు కె’ షూటింగ్ స్పాట్ కు వెళ్లి..

అక్కడ ప్రభాస్ తో మాటలు కలిపాడట అనుదీప్. వెంటనే తన వద్ద ఉన్న కథలు గురించి చెప్పి ప్రభాస్ ను టెంప్ట్ చేశాడు. అంతే ‘కథ మొత్తం మెటీరియలైజ్ అయ్యాక చెప్పు’ అంటూ ప్రభాస్ అనేశాడట. అనుదీప్ లో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటి అంటే.. అతను నెరేషన్ బాగా ఇస్తాడట. దానికి ఎవ్వరైనా కనెక్ట్ అయిపోతారని ఇన్సైడ్ సర్కిల్స్ సమాచారం. ఐయితే ప్రభాస్ నటిస్తున్న సినిమాలు కంప్లీట్ అయ్యేసరికి 2025 వచ్చేస్తుంది కాబట్టి.. అనుదీప్ కు అంత త్వరగా అవకాశం దొరక్కపోవచ్చు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus