Lokesh Kanagaraj: ‘మాస్టర్’ డైరెక్టర్ మనసులో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్

కోలీవుడ్ లో ప్రస్తుతం యువ దర్శకుడిగా మంచి పేరుతో కొనసాగుతున్నారు లోకేష్ కనకరాజ్. తొలిసారిగా కార్తీ తో ఖైదీ సినిమా తీసి దానితో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ ఆ తరువాత ఇలయతలపతి విజయ్ తో ఈ ఏడాది తీసిన సినిమా మాస్టర్. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించగా రిలీజ్ అనంతరం ఈ సినిమా కూడా మంచి విజయం సొంతం చేసుకుంది.

ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ తో విక్రమ్ అనే మూవీ చేస్తున్నారు లోకేష్ కనకరాజ్. మాస్, యాక్షన్ మూవీ గా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారమైన వార్తలను బట్టి లోకేష్ తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ టాప్ హీరోలు మహేష్ లేదా చరణ్ లతో ఛాన్స్ ఉందని సమాచారం. ఇక ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో భాగంగా లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ, కొన్నాళ్ల క్రితం మహేష్ గారికి ఒక స్టోరీ వినిపించాను,

అయితే దాని స్క్రిప్ట్ కి సంబందించిన డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నాయి, అది ఫైనలైజ్ అయితే మీడియాకి తెలియపరుస్తాను అన్నారు. మరోవైపు ఆయన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఒక స్టోరీ లైన్ ని ఇటీవల వినించారని, అది ఎంతో నచ్చిన చరణ్ దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్లు టాక్. అయితే పక్కాగా లోకేష్ తన నెక్స్ట్ సినిమాని చరణ్ తో చేస్తారా లేక మహేష్ తోనా అనేది తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus