Lokesh Kanagaraj: లియో సినిమాకు అదే పెద్ద మైనస్ గా మారింది!

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లియో విజయ్ త్రిష హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్ సినిమా అంటేనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ కంటెంట్ పరంగా ప్రేక్షకులు అనుకున్న స్థాయికి సినిమా చేరుకోలేకపోయింది.ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఆ అంచనాలను చేరుకోవడంలో విఫలం అయినప్పటికీ కమర్షియల్ గా మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

దసరా పండుగకు సెలవులు రావడంతో ఈ సినిమా కంటెంట్ పరంగా మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించిందని చెప్పాలి. అయితే ప్రేక్షకులలో మాత్రం ఎక్కడో చిన్న నిరాశ మాత్రం ఉందని చెప్పాలి. ఈ సినిమాలో మొదటి హాఫ్ ప్రేక్షకులను మంచిగా ఎంటర్టైన్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ గా అనిపించిందని సెకండ్ హాఫ్ సినిమాకు దెబ్బతీసిందనే అభిప్రాయం ప్రతి ఒక్క ప్రేక్షకుడిలోనూ ఉంది.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి లోకేష్ (Lokesh Kanagaraj) ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులు సెకండ్ హాఫ్ బాగలేదని చెబుతున్నారు. వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తానని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోకపోవడానికి నేనే కారణమని తెలిపారు. ఈ సినిమా విడుదల తేదీని ముందుగా ప్రకటించడమే ఈ సినిమాకు పెద్ద మైనస్ గా మారిందని,

విడుదల తేదీ దగ్గర పడటంతో ఏమి షూట్ చేస్తున్నానో క్లారిటీ లేకుండా షూట్ చేశానని అదే సినిమాకు మైనస్ గా మారింది అంటూ ఈ సందర్భంగా లోకేష్ తెలియజేయడమే కాకుండా ఇకపై నా సినిమాలకు నేను విడుదల తేదీలను ప్రకటించనని ఈ సినిమా నా జీవితంలో ఒక చేదు జ్ఞాపకం గానే మిగిలిపోయింది అంటూ లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus