Mahesh Babu , Rajamouli: మహేష్.. ఏంటీ జక్కన్న పదేళ్ళు నీ దగ్గరేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  , దర్శకుడు రాజమౌళి (Rajamouli)  కలిసి చేయబోతున్న సినిమాపై అభిమానుల్లో అంచనాలు హై లెవెల్లో ఉన్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా రూపొందబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ కోసం లుక్‌లో మార్పులు తెచ్చుకుని, డిఫరెంట్‌ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఇక రాజమౌళి ‘SSMB29’ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం.

Mahesh Babu , Rajamouli

ఎప్పటిలాగే ప్రెస్ మీట్ లేదా స్పెషల్ ఈవెంట్‌లో ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయి, క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ సినిమా గురించి కొత్త ప్రచారం మొదలైంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బాహుబలి తరహాలోనే SSMB29 రెండు భాగాలుగా వస్తే, భారీ బడ్జెట్‌కి తగిన విధంగా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే మొత్తం ప్రాజెక్ట్‌కి 1500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తారనే టాక్ ఉంది. రాజమౌళి గతంలో బాహుబలి సినిమా కోసం ఐదేళ్ల సమయం తీసుకున్నాడు. ప్రభాస్ ఆ టైమ్ లో బాహుబలి (Baahubali) తప్ప మరొకటి చేయలేదు.

ఇక ఇప్పుడు మహేష్ తో 1500 కోట్లకు పైగా బడ్జెట్ తో అంతకుమించి అనేల వస్తోన్న సినిమా కాబట్టి జక్కన్న 10 ఏళ్ళ టైమ్ తీసుకుంటాడా? అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్ చేస్తున్నారు. అంటే మహేష్ ను పదేళ్ళు వదిలేలా లేడని కూడా రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక సినిమా రెండు భాగాలుగా వచ్చినా, మార్కెటింగ్ స్ట్రాటజీ సక్సెస్ అయ్యేలా జక్కన్న ప్లాన్ చేస్తారని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ ట్విస్టుతోనే రోలెక్స్ అరాచకం.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus