Mani Ratnam: సీనియర్లూ.. మీరు మణిరత్నాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.. జెట్‌స్పీడ్‌లో..!

ఒకప్పుడు ఒక సినిమాకు మరో సినిమాకు స్టార్‌ హీరోలు నెలల కొద్ది గ్యాప్‌ ఇచ్చేవారు. ఇప్పుడు స్టార్‌ దర్శకులు కూడా ఇదే బాటపట్టారు. చాలామంది దర్శకులు నెలల తరబడి గ్యాప్‌ తీసుకొని సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి కాన్సెప్ట్‌లో సీనియర్‌ దర్శకులు కూడా ఉన్నారు. కావాలంటే మీరే ఓసారి చూసుకోండి.. ఎంతమంది సీనియర్‌ దర్శకులు గ్యాప్‌లో ఉన్నారో మీకే తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ఓ సీనియర్‌ దర్శకుడు వరుస సినిమాలు చేస్తున్నారు.

Mani Ratnam

ఈ రేర్‌ ఫీట్‌ చేస్తున్న సీనియర్‌ దర్శకుడే మణిరత్నం (Mani Ratnam) . ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) సినిమాలతో గత రెండేళ్లుగా వరుసగా ప్రేక్షకుల్ని పలకరించిన మణిరత్నం.. ఈ ఏడాది ఇప్పటివరకు సినిమా రిలీజ్‌ చేయలేదు. అయితే వచ్చే రెండేళ్లలో రెండు పెద్ద హీరోల సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి కమల్‌ హాసన్‌ (Kamal Haasan) సినిమా కాగా, రెండో సినిమా రజనీకాంత్‌ది (Rajinikanth) అంటున్నారు. కమల్‌తో తెరకెక్కిన ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) వచ్చే ఏడాది వేసవిలో రాబోతోంది.

ఈ సినిమా అయిన తర్వాత రజనీకాంత్‌ సినిమా కోసం మణిరత్నం ప్లాన్స్‌ చేస్తారని సమాచారం. ఇదంతా చూస్తున్న సినిమా జనాలు మన దర్శకులు ఇలా ఎందుకు లేరు.. ఎందుకు సినిమా తర్వాత సినిమా ఓకే చేసుకోవడం లేదు అని అంటున్నారు. మరోవైపు యువ దర్శకులు కూడా ఇలా ఆలోచించాలి కదా అని అంటున్నారు. సినిమా వెంటనే మరో సినిమా స్టార్ట్‌ చేయకపోయినా ఓకే.. కనీసం ప్రాజెక్ట్‌ను ఫైనల్‌ చేసుకోవాలి కదా అని అంటున్నారు.

ఇక్కడ మరో విషయం ఏంటంటే మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాలతో తన కల నెరవేర్చుకున్నారు. ఇప్పుడు మూడు దశాబ్దాల క్రితం కలసి పని చేసిన హీరోలతో ఇప్పుడు మళ్లీ పని చేస్తున్నారు. ఇది కూడా మన సీనియర్‌ దర్శకులు పట్టించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పుడో కలసి పని చేసిన హీరోకు ఇప్పటికి తగ్గట్టు కథ రాసుకోవడం అంటే పెద్ద విషయమే. అందుకే మణి సార్‌.. మణి సార్‌ అంతే అని అంటున్నారు.

బుల్లితెర రేటింగ్ లో మహేష్ మరో రికార్డ్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus