ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీల పిల్లలు చాలా చురుగ్గా ఉంటూ వారికి నచ్చిన రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే స్టార్ కిడ్స్ గా కొనసాగుతున్నటువంటి సితార, అల్లు అర్హ, వంశీ పైడిపల్లి కుమార్తె వీరందరూ కూడా పెద్ద ఎత్తున వారికి నచ్చినటువంటి రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే డైరెక్టర్ మారుతి కుమార్ హియా దాసరి సైతం అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తారని తాజాగా వెలుగులోకి వచ్చారు.
హియా దాసరి అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉండగా, కొడుకేమో మ్యూజిక్, బ్యాండ్స్ అంటూ టాలెంట్ చూపిస్తుంటాడు. హియా పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. రీసెంట్‌గా ఓ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేసింది. అల్లు అరవింద్ వంటి కొందరు సినీ ప్రముఖులు విచ్చేసి ఈమె టాలెంట్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హియ దాసరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి పలు విషయాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా హియా దాసరి మాట్లాడుతూ.. ప్రభాస్ (Prabhas) స్టార్ హీరో అయినప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా చాలా హుందాగా ఎంతో వినయంగా ఉంటారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ప్రభాస్ కిఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టమని ఆయన ప్రేమగా ఎంతో మంది ఆకలి తీర్చుతో అందరికీ ఫుడ్ పెడుతూ ఉంటారని తెలిపారు. ఎదుటివారికి సహాయం చేయడంలో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారని ఆయన చాలా మంచివారు అని తెలిపారు.
ఇక ప్రభాస్ ప్రతి విషయంలోనూ అందరికీ ఎంతో స్ఫూర్తిగా ఉంటారని నాకైతే ప్రభాస్ గారి స్ఫూర్తి అంటూ ఈ సందర్భంగా హియా దాసరి ప్రభాస్ గురించి ఆయన మంచితనం గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు.ఇక ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసింది.