2026 సంక్రాంతికి వచ్చే సినిమాల సంఖ్య ఫిక్సయిపోయింది. ప్రభాస్ ‘ది రాజాసాబ్’, చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మధ్యలో విజయ్ ‘జన నాయకుడు’, శివకార్తికేయన్ ‘పరాశక్తి’ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికే వస్తున్నట్టు ప్రకటనలు వచ్చాయి.
వాటిని కూడా కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం అనేది షాక్ ఇచ్చే అంశం. ముందుగా అంటే జనవరి 9న ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ గత సినిమాలు ‘సలార్’ ‘కల్కి 2898 AD’ వంటివి సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి ‘ది రాజాసాబ్’ పై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే నవీన్ పోలిశెట్టి గత సినిమాలు ‘జాతి రత్నాలు’ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కూడా హిట్టయ్యాయి.

కాబట్టి ‘అనగనగా ఒక రాజు’ పై అంచనాలు ఉన్నాయి. కానీ మిగతా హీరోలంతా ప్లాపుల్లో ఉన్నారు.చిరంజీవి గత సినిమా ‘భోళా శంకర్’ డిజిటర్ అయ్యింది. తర్వాత రావాల్సిన ‘విశ్వంభర’ కూడా వాయిదా పడింది. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డుపై ఆధారపడి చిరు ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ తో సంక్రాంతి బరిలోకి దూసుకొస్తున్నారు. మరోపక్క రవితేజకి అరడజను ప్లాపులు పడ్డాయి.
అయినా సరే దర్శకుడు కిషోర్ తిరుమల సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ను నమ్మి ‘భర్త మహాశయులకు..’ తో వస్తున్నాడు. శర్వానంద్ పరిస్థితి కూడా అంతే. ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు రామ్ అబ్బరాజుని నమ్మి వచ్చేస్తున్నాడు. డబ్బింగ్ హీరోలు విజయ్, శివ కార్తికేయన్..ల గత సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. వాళ్ళు కూడా సంక్రాంతి సీజన్, డైరెక్టర్స్ ట్రాక్ రికార్డునే నమ్ముకుని వచ్చేస్తున్నారు.
