Maruthi: 2 డిజాస్టర్లు ఇచ్చినా… మారుతికి అంత ఇస్తున్నారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ‘ది రాజాసాబ్’ (The Rajasaab) అనే సినిమా తెరకెక్కుతుంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వ ప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మారుతి (Maruthi Dasari)  దర్శకుడు. ఇదొక హర్రర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని గ్లింప్స్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో దర్శకుడు మారుతి ఓ ప్రత్యేక శైలి ఉంది. ప్రభాస్ నుండి ఓ ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది.

Maruthi

అలాగే హారర్ జోనర్..ని ప్రభాస్ ఇప్పటివరకు టచ్ చేసింది లేదు. అందువల్ల ‘ది రాజాసాబ్’ పై అంచనాలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మరోపక్క నిర్మాత విశ్వప్రసాద్ కూడా మాకు ఇప్పటివరకు వచ్చిన నష్టాలన్నిటినీ ‘ది రాజాసాబ్’ సినిమా తీర్చేస్తుంది అనే ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉంటే..’ది రాజాసాబ్’ సినిమాకి మారుతి అందుకునే పారితోషికం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మారుతి గత చిత్రాలు ‘మంచి రోజులు వచ్చాయి’ ‘పక్కా కమర్షియల్’ వంటివి డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి హీరో దొరకడం కూడా చాలా కష్టం. అయినప్పటికీ అతను ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్..ను పట్టేశాడు. ఇది అతనికి సువర్ణ అవకాశం. ‘అదే ఎక్కువ… ఇక పారితోషికం పెద్దగా ఉండదేమో మారుతీకి’ అని చాలా మంది అనుకుంటున్నారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ది రాజాసాబ్’ కోసం మారుతీ ఏకంగా రూ.15 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడట. బహుశా.. ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు..! కానీ ఇది నిజమనే టాక్ ఎక్కువగానే వినిపిస్తుంది.

సమంతని ఆకాశానికెత్తేసిన త్రివిక్రమ్..అంత సీన్ ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus