Meher Ramesh: మహేష్ సినిమాలో కమెడియన్ గా మెహర్ రమేష్!

ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కొనసాగుతూ వరుస ప్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ ఫ్లాప్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ మెహర్ రమేష్.తెలుగు సినిమాలను కన్నడ భాషలో రీమేక్ చేసి అక్కడ దర్శకుడిగా సెన్సేషనల్ హిట్స్ అందుకున్నారు కానీ తెలుగులో మాత్రం ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. ఈ క్రమంలోనే మరోసారి మెహర్ రమేష్ భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా భోళాశంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఈయన పట్ల చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా మెహర్ రమేష్ కి చెందినటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాకముందు నటుడిగా నటించారని చాలామందికి తెలియదు. మెహర్ రమేష్ డైరెక్టర్ కాకముందు ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన బాబి సినిమాలో కమెడియన్ గా సునీల్ అనే పాత్రలో నటించారు.

అయితే ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈయన నటనకు దూరమయ్యారు. ఇలా (Meher Ramesh) మెహర్ రమేష్ ఈ ఒక్క సినిమాలో మాత్రమే నటించారు అనంతరం ఈయన డైరెక్టర్గా మారిపోయారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్నటువంటి మెహర్ రమేష్ అనంతరం ఆంధ్రావాలా ఒక్కడు వంటి సినిమాలను కన్నడ భాషలో రీమేక్ చేసే సక్సెస్ అందుకున్నారు.

ఇక తెలుగులో ఈయన కంత్రి, బిల్లా, శక్తి ,షాడో, భోళాశంకర్ వంటి సినిమాలను చేశారు. అయితే ఈయన చేసినటువంటి బిల్లా సినిమా మాత్రమే పరవాలేదు అనిపించుకున్నప్పటికీ మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో ఈయన ఫ్లాప్ డైరెక్టర్ గానే ముద్ర వేసుకున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus