ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు చేయడం బాగా ఎక్కువైంది. ఒక భాషలో హిట్ అయిన సినిమాను వేరే భాషల్లో రీమేక్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు హిట్స్ గా నిలిచాయి. తెలుగులో కూడా రీమేక్ సినిమాలు ఎక్కువవుతున్నాయి. ప్రతీవారం విడుదలవుతున్న సినిమాల్లో కచ్చితంగా ఒక రీమేక్ సినిమా ఉంటుంది. చాలా మంది దర్శకులు కూడా రీమేక్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాత్రం ఇకపై రీమేక్స్ చేసే ప్రసక్తే లేదని అంటున్నారు.
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ అనే హిట్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన మేర్లపాక గాంధీ.. ఆ తరువాత ‘ఎక్స్ ప్రెస్ రాజా’ అనే మరో సినిమా తీసి హిట్ కొట్టారు. ఆ తరువాత ‘కృష్ణార్జున యుద్ధం’ అనే సినిమా తీశారు. ఇది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకొని ‘మాస్ట్రో’ అనే సినిమా తీశారు. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఒక రీమేక్. బాలీవుడ్ సూపర్ హిట్ అయిన ‘అందాదూన్’కి ఇది రీమేక్. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు.
ఈ సినిమా జనాలకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు మేర్లపాక గాంధీ. ఇకపై రీమేక్ సినిమాలు చేయనని.. స్ట్రయిట్ సినిమాలే తీస్తానని అన్నారు. ‘మాస్ట్రో’ తరువాత కూడా ఓ పెద్ద సంస్థ నుంచి రీమేక్ సినిమా ఆఫర్ వచ్చిందని.. కానీ తనే వదులుకున్నట్లు చెప్పారు. రీమేక్ సినిమా అంటే యాక్టర్ కి కూడా ఆసక్తి ఉండదని..
ముఖ్యంగా ఎగ్జైట్మెంట్ ఉండదని అన్నారు. అందుకే ఇకపై రీమేక్ సినిమా చేయకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ రూపొందించిన ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందు కాస్త బజ్ వచ్చినప్పటికీ.. సినిమాకి పాజిటివ్ టాక్ అయితే రావడం లేదు.
Most Recommended Video
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!