Nag Ashwin: ‘కల్కి 2’ ప్రశ్నలు.. మరిన్ని అడగండి అంటూ… క్లారిటీ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌

ఓ సినిమా రిలీజ్‌ అయ్యే ముందు వచ్చే పుకార్లు కంటే.. ఆ సినిమా సీక్వెల్‌ లేదా రెండో పార్టు వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. వాటిలో కొన్ని నిజమవుతుంటాయి కూడా. అయితే కొన్ని మాత్రం భలే క్రేజీగా ఉంటూ ఆసక్తికరంగా అనిపిస్తాయి. అలా ఇప్పుడు క్రేజీ రూమర్స్‌ వస్తున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) . ప్రభాస్‌ (Prabhas)  హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin)  తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉందనే విషయం తెలిసిందే. దీని గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్ల గురించి నాగ్‌ అశ్విన్‌ ఇటీవల స్పందించారు.

Nag Ashwin

రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొంది రూ. 1100 కోట్లకుపైగా వసూలు చేసిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమ్‌ అవ్వనుంది. ఆగస్టు 22 నుండి అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ (హిందీ వెర్షన్‌)లో సినిమా స్ట్రీమ్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో రెండో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సంబంధించి సోషల్‌ మీడియాలో అభిమానులు ప్రచారం చేస్తోన్న కొన్ని ఊహాగానాలకు నాగ్‌ అశ్విన్‌ సమాధానాలు ఇచ్చారు. కొన్ని బాగున్నాయి, కథకు పనికొస్తాయి అని కూడా చెప్పారు.

సుమతి (దీపిక పడుకొణె (Deepika Padukone)  పాత్ర పేరు)కి పుట్టిన బిడ్డ యాస్కిన్‌ను అంతం చేస్తాడు కదా అని అంటే.. దాని కోసం భైరవ (ప్రభాస్) ఉన్నాడు కదాజ.. ఈ కథకు అతనే హీరో అని క్లారిటీ ఇచ్చారు నాగ్‌ అశ్విన్‌. మరి దీపికా పడుకొణెకు పుట్టిన అబ్బాయిగా ప్రభాస్‌ను చూపిస్తారా? అని అడిగితే.. మీరు చెబుతున్న లైన్‌ అమెరికన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ కమ్‌ యాక్షన్‌ సినిమా ‘ది టెర్మినేటర్‌’ కథలా ఉంది. ఇది ‘కల్కి 2898 ఏడీ’ స్టోరీలా లేదు అని అన్నారు. రెండో పార్ట్‌లో బుజ్జి వైట్‌ హార్స్‌లా మారిపోతుంది అని ఓ నెటిజన్‌ గెస్‌ చేస్తే.. మీ ఆలోచన గొప్పగా ఉంది.

అయితే ‘బుజ్జి’ వాహనం మాత్రమే. వైట్‌ హార్స్‌ కాదు అని తేల్చేశారు నాగీ. విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) పాత్ర రెండో పార్ట్‌లోనూ ఉంటుంది. భైరవకు అతను సపోర్టుగా ఉంటాడు అని రాస్తే.. ఈ విషయమూ ఆసక్తికరంగా ఉంది. కానీ ఇది రూమర్‌ మాత్రమే అని చెప్పారు. అలాగే దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salmaan), కూడా రెండో పార్ట్‌లో కనిపిస్తాడు. ప్రభాస్‌ పాత్ర వెనక ఉన్న నిజాన్ని చెబుతాడు అని ఒక నెటిజన్‌ ఊహిస్తే.. నేనైతే అలాంటి వార్త చదవలేదు. ఇది నిజం కాదని అనుకుంటున్నా అని చెప్పారు.

 ‘బిగ్ బాస్’ ఆఫర్ ను వదులుకున్న వేణు స్వామి..ఎందుకంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus