Naga Chaitanya: అరగంట విని అదిరిందన్న నాగ చైతన్య!..ఏం జరిగిందంటే..?

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్ స్టార్టింగ్ నుండి స్టోరీస్ సెలక్షన్ విషయంలో కానీ, క్యారెక్టర్‌కి తగ్గట్టు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో కానీ డిఫరెన్స్ చూపిస్తూ వస్తున్నాడు. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. సినిమా సినిమాకీ యాక్టర్‌గా ఇంప్రూవ్ అవుతూ.. అక్కినేని అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం.. ఆమిర్ లాంటి లెజెండరీ యాక్టర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటేనే చైతు పర్ఫార్మెన్స్‌కి ఆయన ఏ విధంగా ఫిదా అయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు..

ఈ ఏడాది ఇప్పటికే ‘బంగార్రాజు’, ‘థ్యాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ చేస్తున్నాడు. ‘తడాఖా’ తర్వాత ఇందులో పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఆమధ్య నందిని రెడ్డి, మెహన్ కృష్ణ ఇంద్రగంటి లాంటి డైరెక్టర్ల పేర్లు వినిపించాయి కానీ ఏ ప్రాజెక్టూ ఫైనల్ కాలేదు. ఇప్పుడు చై ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇంతకుముందు యంగ్ డైరెక్టర్ పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో, 14 రీల్స్ ప్లస్ నిర్మాణంలో, యువసామ్రాట్ హీరోగా ఓ మూవీ కన్ఫమ్ అయింది. పూజా కార్యాక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు కూడా.. కట్ చేస్తే.. అక్కడి నుండి ఆ ఫిలిం ముందుకు కదలలేదు.. తర్వాత చై ‘లవ్ స్టోరీ’ చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి పిలుపు రావడంతో పరశురామ్ ‘సర్కారు వారి పాట’ కి షిఫ్ట్ అయిపోయాడు. ఈమధ్యే బాలయ్య, గీతా ఆర్ట్స్‌లో బుజ్జి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.

‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. త్వరలో అద్భుతమైన కథతో మిమ్మల్ని కలుస్తానని బాలయ్య ముందే చెప్పాడు పరశురామ్.. ఇదిలా ఉంటే.. ఎట్టకేలకు కొంతగ్యాప్ తర్వాత ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. రీసెంట్‌గా చైతన్యని కలిసి.. స్టోరీ లైన్‌తో పాటు 30 నిమిషాల కాన్సెప్ట్ చెప్పాడట పరశురామ్.. (ఆలస్యం అవడం వల్ల కథ మార్చారేమో మరి).. డైరెక్టర్ నేరేషన్ విని చైతన్య అదిరిపోయిందని చెప్పాడట..

అరగంట వినే అదిరిపోయింది అంటే.. ఇక పూర్తి కథ ఎలా ఉండి ఉంటుందో.. మొత్తానికి లేట్ అయినా కానీ లేటెస్ట్‌గా అన్నట్టు చైతన్య కోసం సాలిడ్ స్టోరీ రెడీ చేశాడు డైరెక్టర్ అనే మాటలు ఫిలిం నగర్‌లో వినిపిస్తున్నాయి. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రానుంది..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus