పరశురామ్ కూడా తమిళ హీరోని పట్టేశాడుగా..!

టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలు ఖాళీ లేరు. అందరూ రెండేసి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పట్లో వాళ్ళు ఖాళీ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో మన స్టార్ హీరోల కోసం రాసుకున్న కథలతో కోలీవుడ్ స్టార్ హీరోలను మెప్పించి ప్రాజెక్టులు ఓకే చేయించుకుంటున్నారు మన దర్శకులు. దీంతో ద్విభాషా చిత్రాలు ఎక్కువవుతున్నాయి. ఆల్రెడీ ‘ప్రిన్స్’ ‘వారసుడు’ వంటి చిత్రాలు వచ్చాయి. నిజానికి ఇవి బైలింగ్యువల్ మూవీస్ అని చెప్పి తర్వాత డబ్బింగ్ చేసి సరిపెట్టారు.

ఇక మరో రెండు రోజుల్లో ‘సార్’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ పరశురామ్ కూడా ఓ తమిళ హీరోని పట్టేశాడు. వివరాల్లోకి వెళితే… ‘స‌ర్కారు వారి పాట’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న పరశురామ్… ఇటీవల విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. దాని గురించి కొన్ని గొడవలు కూడా అయ్యాయి. అయితే ఈలోగా మ‌రో హీరోతో ప్రాజెక్టుని సెట్ చేసుకున్నాడు పరశురామ్. ఆ హీరో మరెవరో కాదు కార్తీ. ఈ మధ్యనే… చెన్నైని వెళ్లి, కార్తిని క‌లిసి కథ చెప్పి వచ్చాడు ప‌ర‌శురామ్.

తాజాగా కార్తి కూడా పరశురామ్ కథకు ఓకే చెప్పేసినట్టు వినికిడి. కార్తీకి తెలుగులో క్రేజ్ ఎక్కువే. ‘ఊపిరి’ తో ఆల్రెడీ ఓ స్ట్రైట్ తెలుగు మూవీ చేశాడు. చాలా కాలంగా తెలుగులో మరో స్ట్రైట్ తెలుగు మూవీ చేయడం కోసం కథలు వింటున్నాడు. ఫైనల్ గా ఇతనికి ప‌ర‌శురామ్ క‌థ న‌చ్చింది. కార్తీ 25వ సినిమాగా ఈ ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుని ఏ ప్రాజెక్టు నిర్మిస్తుంది అనేది త్వరలో తెలుస్తుంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus