సూపర్ స్టార్ మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చెయ్యాలని అని అనుకున్నాడు. కానీ కథ పట్ల సంతృప్తి చెందక పోవడంతో పరశురామ్(బుజ్జి) కి ఛాన్స్ ఇచ్చాడు. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ’14 రీల్స్ ప్లస్’ ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను విడుదల చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సినిమా పై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ చిత్రానికి గాను దర్శకుడు పరశురామ్ అందుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను 8 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో 20శాతం షేర్ ను కూడా పరశురామ్ తీసుకోబోతున్నాడట. అయితే ముందుగా అడ్వాన్స్ రూపంలో 4 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. సినిమా పూర్తయ్యాక పూర్తి రెమ్యూనరేషన్ తీసుకుంటాడని టాక్ నడుస్తుంది.
దాంతో మొత్తం కలుపుకుంటే 10కోట్లు దాటుతుందని తెలుస్తుంది. ‘గీత గోవిందం’ సినిమాకి కూడా పరశురామ్ ఇలాగే చేసాడట. అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ‘గీత గోవిందం’ కూడా ఒకటి. దాదాపు 50కోట్ల పైనే ఆ చిత్రానికి లాభాలు వచ్చాయి కాబట్టి పరశురామ్ కు బాగానే మిగిలిందట. ఇప్పుడు మహేష్ సినిమాకి కూడా అదే రేంజ్లో లాభాలు వస్తే.. పరశురామ్ పారితోషికం భారీ రేంజ్లో పెరిగే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు.