రాజమౌళి మొదటి సినిమా ఏది? ఇదేం ప్రశ్న అసలు… ఆయన తొలి సినిమా ఏంటో అందరికీ తెలిసిందే కదా అంటారా? ఇక్కడే లాజిక్ ఉంది. రాజమౌళి తొలి సినిమా గురించి చాలా తక్కువమందికే తెలుసు. ఛస్ ఊరుకోండి. ఆయన తొలి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ అని చెప్పకండి. ఎందుకంటే ఆయన తొలి సినిమా ఇప్పటిది కాదు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా అసలు విడుదలే కాలేదు. అవును ఈ విషయం ఆయనే చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రచారంలో భాగంగా ఈ విషయం బయటికొచ్చింది.
‘ఆర్ఆర్‌ఆర్’ వీరులు రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ను ఇటీవల రానా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ముంబయిలోని బీచ్ ఒడ్డున ఉన్న తన ఇంట్లో ఈ ఇంటర్వ్యూ సాగింది. ఈ క్రమంలో ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు అని ముగ్గురినీ రానా ప్రశ్నించాడు. దాని ముగ్గురూ వేర్వేరుగా చెప్పుకొచ్చారు. కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఇద్దరికీ సినిమాల ఎంపిక విషయంలో సరైన పట్టు ఉండేది కాదని చెప్పుకొచ్చారు రాజమౌళి.
ఇప్పుడు చూస్తే… సినిమా కథల ఎంపిక విషయంలో ఇద్దరికీ మంచి పట్టు వచ్చిందని చెప్పారు జక్కన్న. ఈ క్రమంలో ఎవరు సీనియర్, ఎవరు జూనియర్ అనే టాపిక్ వచ్చింది. నిజానికి ఈ ముగ్గురు దగ్గరదగ్గరలో కెరీర్ ప్రారంభించారు. దర్శకుడిగా రాజమౌళి, హీరోగా ఎన్టీఆర్ దాదాపు ఒకే సమయంలో కెరీర్ స్టార్ట్ చేశారు. ఈ విషయాన్నే మాట్లాడుతుంటుంటే.. తారక్ ‘నేను 1991లోనే తాతగారితో సినిమా చేశానని’ చెప్పాడు. దానికి రాజమౌళి అలా అయితే 1983లోనే తాను సినిమాలో నటించినట్లు చెప్పుకొచ్చారు.
దానిపేరు ‘పిల్లనగ్రోవి’ అని చెప్పారు. అయితే ఆ సినిమా విడుదల కాలేదన్నారు. ఆ లెక్కన రాజమౌళి తొలి సినిమా ‘పిల్లనగ్రోవి’ అన్నమాట. అందులో ఆయన చిన్న పాత్రలో నటించారు. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత దర్శకుడిగా మారి… ‘స్టూడెంట్ నెం 1’తో వచ్చారు. తొలుత దర్శకేంద్రుడి పర్యవేక్షణలో దర్శకుడిగా మారి… ఇప్పుడు దేశం గర్వించదగ్గర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?