‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కాంట్రవర్షియల్ సీన్!

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన టీజర్లు బయటకి వచ్చాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తమ గెటప్పులతో మెప్పించారు. అయితే టీజర్ లో కొమరం భీమ్ పాత్రని చూపించిన విధానంపై మాత్రం విమర్శలు వచ్చాయి. కొమరం భీమ్ పాత్రకి ముస్లింలు ధరించే టోపీ పెట్టడంపై పలువురు మండిపడ్డారు. చరిత్రను వక్రీకరించొద్దు అంటూ రాజమౌళిపై విమర్శలు గుప్పించారు.

అప్పటివరకు ఎలాంటి వివాదాలు లేని ఈ సినిమాపై కొమరం భీమ్ పాత్ర తొలి వివాదాన్ని సృష్టించింది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా ఇలాంటి వివాదానికి దారి తీయబోతుందని సమాచారం. అల్లూరిని ఈ సినిమాలో పోలీస్ అధికారికంగా చూపించబోతున్నారట రాజమౌళి. పైగా జలియన్ వాలా బాగా కి సంబంధించిన ఎపిసోడ్ ని సినిమా కోసం చిత్రీకరించనున్నారు. చరిత్ర ప్రకారమైతే.. జలియన్ వాలా బాగ్ కి, అల్లూరికి, కొమరం భీమ్ కి ఎలాంటి సంబంధం లేదు. కానీ రాజమౌళి తన ఫిక్షన్ కథతో అల్లూరి సీతారామరాజు ఈ జలియన్ వాలా బాగ్ ఘటనలో పాల్గొన్నాడనే అర్ధం వచ్చే రీతిలో ఓ సన్నివేశాన్ని డిజైన్ చేశాడట.

అది కూడా విమర్శలకు దారి తీసే అవకాశం ఉందనిపిస్తోంది. కొమురం భీమ్ నిజాంలపై పోరాడాడు. అలాంటి పాత్రని ముస్లింగా చూపించాడు రాజమౌళి. అల్లూరి సీతారామరాజు తెల్ల దొరలపై పోరాటం చేశారు. బ్రిటీష్ వారికి చెందిన పోలీస్ స్టేషన్ ని భూస్థాపితం చేశాడు. అలాంటి అల్లూరి పాత్రని ఇప్పుడు ఖాకీ బట్టల్లో చూపిస్తారట. రాజమౌళి ఏం స్కెచ్ వేస్తున్నాడో కానీ.. సినీ అభిమానులు ఫిక్షన్ కథగా ఈ సినిమాని చూస్తే ఓకే.. కానీ రాజకీయ నాయకులు, విమర్శకులు వేరే కోణంలో ఈ సినిమాను చూస్తే మాత్రం వివాదాలు తప్పవనే చెప్పాలి.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus