Rajamouli: ఆర్ఆర్ఆర్ ఇండియా వాళ్ళ కంటే వారికే ఎక్కువగా నచ్చింది: రాజమౌళి

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి సినిమాలు అంటే ఎలాంటి పిచ్చి ఉంటుందో మనకు తెలిసిందే. నిజం చెప్పాలంటే ఈయన ఒక సినిమా పిచ్చోడు అనడంలో సందేహం లేదు.ఒక సినిమాని చేస్తున్నారంటే అందులో ప్రతి ఒక్క సన్నివేశం చాలా పర్ఫెక్ట్ గా రావడం కోసం ఈయన కష్టపడటమే కాకుండా ఇతరులను కూడా అదే స్థాయిలో కష్ట పెడుతూ ఉంటారు. ఇలా సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తారు కనుక ఈయన దర్శకత్వంలో వచ్చే సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఉంటాయి.

బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందిన రాజమౌళి RRR సినిమా ద్వారా మరింత ఆదరణ పొందారు. ఈ సినిమా ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఎంతో మంచి విజయం అందుకోవడమే కాకుండా జక్కన్నకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను కూడా అందిస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాజమౌళి ఈ సినిమా సక్సెస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఈ సినిమా చేసే సమయంలో ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని భావించాము. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఇండియాలో కన్నా విదేశాలలోనే ఎక్కువగా సక్సెస్ అయిందని, విదేశీయులే ఈ సినిమాని ఎక్కువగా ఇష్టపడుతున్నారని వెల్లడించారు. అసలు ఈ సినిమాలో ఏముందని వాళ్ళు అంతలా ఇష్టపడుతున్నారో అర్థం కావడం లేదని రాజమౌళి చెప్పడంతో

ఒక్కసారిగా యాంకర్ కూడా షాక్ అయ్యారు.మొత్తానికి జపాన్ లోనూ అమెరికాలోనూ ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో రాజమౌళి మాత్రం ఈ సినిమా సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus