Rajamouli: దర్శకధీరుడు హీరోలకు ఆ స్వేచ్ఛను ఇస్తారా?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి చేస్తున్న ఒక తప్పు వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి కోట్ల రూపాయల నష్టం వస్తుండటం గమనార్హం. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా రాజమౌళి చేస్తున్న చిన్న తప్పు వల్ల ఇండస్ట్రీకి మాత్రం భారీగా నష్టం కలుగుతోంది. ఒక్క విషయంలో రాజమౌళి మారితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో ఆరుగురు హీరోలకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లతో సినిమాలను తెరకెక్కిస్తే తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా భారీస్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. అయితే రాజమౌళి తన డైరెక్షన్ లో నటించే హీరోలకు కొన్ని షరతులు విధిస్తున్నారు. తన డైరెక్షన్ లో నటించే సమయంలో మరో సినిమాలో నటించకూడదని హీరోలకు రాజమౌళి పెడుతున్న షరతు వల్ల ఇండస్ట్రీకి నష్టం కలుగుతోంది. 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే మార్కెట్ ఉన్న హీరోలు ఒకే సినిమాకు పరిమితమవుతూ ఉండటంతో ఆ హీరోల సినిమాల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది.

గడిచిన నాలుగు సంవత్సరాలలో తారక్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రమేననే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ కూడా మూడు నుంచి నాలుగేళ్ల పాటు రాజమౌళి సినిమాకే పరిమితం కానున్నారు. బాహుబలి, బాహుబలి2 సినిమాల కోసం ప్రభాస్ ఐదేళ్ల సమయం కేటాయించాల్సి వచ్చింది. తన సినిమాలలో నటించే హీరోలకు అదే సమయంలో మరో సినిమాలో కూడా నటించే అవకాశం జక్కన్న ఇస్తే ఇండస్ట్రీకి మేలవుతుంది.

రాజమౌళి ప్రాజెక్ట్ ల వల్ల హీరోల కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతోంది. రెగ్యులర్ గా సినిమాలు చేసే టాలీవుడ్ స్టార్ హీరోలు జక్కన్న డైరెక్షన్ లో నటిస్తే సినిమాల విషయంలో వేగం తగ్గించాల్సి వస్తోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus