రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ దృష్ట్యా ఎవరైనా ఆయనతో సినిమా చేయాలనుకుంటారు. బాహుబలి తరువాత ఆయన ఇమేజ్ ఇండియా లెవల్ కి చేరింది. బాలీవుడ్ హీరోలు సైతం ఆయన కోసం క్యూ కట్టే పరిస్థితి నెలకొని ఉంది. ఐతే ఆయన మాత్రం తన కథకు తగ్గట్టుగా హీరోలను ఎంపిక చేస్తుకుంటారని టాక్. అంతకు మించి ఆయన తన అవసరాలకు అనుగుణంగా పనిచేసే వారు, తన కంఫర్ట్ జోన్ లో ఉండేవారిని ఎంచుకుంటాడని ఆయన మాటలు వింటే అర్థం అవుతుంది.
కాగా ఓ ఇంటర్వ్యూ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా ఉన్న బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పుడైనా అనుకున్నారా అని అని రాజమౌళిని అడుగగా ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఏ దర్శకుడికైనా ప్రతి హీరోతో మూవీ చేయాలని ఆశ ఉంటుంది. ఒక హీరోకి ఉండే ఇమేజ్ దృష్ట్యా కథ అనుకుంటున్నప్పడు ఆ హీరో ఐతే సరిపోతాడు అనిపిస్తుంది. నాకు కూడా కొన్ని కథలు వినేటప్పుడు బాలకృష్ణ సరిపోతారు ఆయనతో చేస్తే బాగుండు అనే ఆలోచన కలిగింది.
ఐతే అనుకోని కారణాల వలన ఆయనతో మూవీ కార్యరూపం దాల్చలేదు అని రాజమౌళి అన్నారు. ఇక నందమూరి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య శత్రుత్వం ఉంటుంది. ఆ కుటుంబాలకు చెందిన హీరోలను ఆర్ ఆర్ ఆర్ కి తీసుకొని కొత్త ట్రెండ్ కి నాంది పలికాను అని రాజమౌళి పరోక్షంగా చెప్పారు.ఇప్పటి వరకు రాజమౌళి 11 సినిమాలు తీయగా వాటిలో 6సినిమాలు ఎన్టీఆర్, ప్రభాస్ లతోనే తీశాడు. కథ ఏదైనా రాజమౌళి తనకు నచ్చిన హీరోలతోనే తీస్తాడు అనడానికి ఇదే నిదర్శనం.
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!